Venu Udugula: వాటి జీవితాలు కథలుగా మారడం అరుదు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:13 PM
రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు.
రామ్ చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. ‘చరణ్ నటించిన ‘పెద్ది’ చూసిన తర్వాత నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది కథ కంటే దాని దృష్టికోణం. మన దేశం గురించి చెప్పే కథల్లో తరచుగా కనిపించకుండా పోయే వేలాది చిన్న గ్రామాలు ఉన్నాయి. అవి మ్యాప్‌లో ఉంటాయి, కానీ మన కలెక్టివ్ ఇమాజినేషన్‌లో ఉండవు. వాటి శ్రమ దేశాన్ని నిర్మిస్తుంది. కానీ వాటి జీవితాలు కథలుగా మారడం అరుదు. అలాంటి గుర్తింపు లేని ఒక గ్రామాన్ని కథా కేంద్రంగా ఎంచుకోవడంలో దర్శకుడి దృష్టి నాకు నచ్చింది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం గురించి పలువురు దర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇండస్ట్రీలో చరణ్‌కు సన్నిహితులైన హీరోలు ఎవరూ ఈ సినిమా గురించి కనీసం ట్వీట్ చేయలేదు. వేణు ఉడుగుల పోస్ట్‌ను చూసి అందరూ అభినందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల నాలుగో తేదిన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.236.7 కోట్లు వసూళ్లు రాబట్టింది.
ALSOR READ: ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!
Singeetam Srinivasa Rao: సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమించారు..