బాబోయ్.. వెంకీమామకు ఇంత డిమాండ్ ఏంటి?
ABN, Publish Date - Jun 26 , 2026 | 10:12 PM
టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరు అంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే పేరు.. విక్టరీ వెంకటేష్. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల ముందు ఇంటిల్లిపాదీ క్యూ కట్టాల్సిందే.
టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరు అంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే పేరు.. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh). ఆయన సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల ముందు ఇంటిల్లిపాదీ క్యూ కట్టాల్సిందే. ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. దానికి ఉదాహరణే గత రెండేళ్లలో ఆయన సృష్టించిన రికార్డులు. గతేడాది సంక్రాంతి బరిలో దిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వెంకీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో పూనకాలు తెప్పించారు. ఈ చిత్రం కూడా వసూళ్ల వర్షం కురిపించి ఏకంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా ఆయనకు ఆయనే సాటి అని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం’ అనే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వెంకీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పెద్ద ట్రీట్. ఈ ప్రాజెక్ట్ అలా ఉంచితే.. తన ఫేవరెట్ డైరెక్టర్, టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరో మల్టీస్టారర్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్‌గానే ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్ కలిసి సందడి చేయబోతున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో యాక్షన్ అస్సలు ఉండదని, కేవలం నవ్వులు మాత్రమే ఉంటాయని అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించడం ఖాయం.
అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరు డైరెక్టర్లే కాకుండా, మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు కూడా వెంకటేష్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. అందులో మొదటి పేరు వశిష్ట (Mallidi Vassishta). ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కిస్తున్నారు వశిష్ట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది, ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే వశిష్ట.. వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. వశిష్ట చెప్పిన స్టోరీ లైన్ వెంకీకి విపరీతంగా నచ్చేసిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబుతో పాటు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించనున్నారు. వీరితో పాటు.. గతంలో ‘వెంకీ మామ’ వంటి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కూడా మరో అదిరిపోయే కథను వెంకటేష్ కోసం సిద్ధం చేశారట. బాబీ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వెంకటేష్‌తో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూసుకుంటే త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాలు పూర్తయిన తర్వాత వెంకటేష్ లైనప్ ఎవరితో ఉండబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘జననాయగన్’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు