సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఖైరతాబాద్‌ మహా గణపతి సన్నిధిలో ‘వేదవ్యాస్‌’ టీమ్ పూజలు

ABN, Publish Date - Sep 22 , 2026 | 08:54 PM

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వేదవ్యాస్‌’ . ఈ మూవీ టీమ్ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

vedavyas movie team

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వేదవ్యాస్‌’ (Vedavyas). మాజీ శాసనసభ్యుడు, కేపీఆర్ ఐటీ విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాతగా.. సాయిప్రగతి ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుంది. నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకుడు అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌, సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రతాప్‌రెడ్డి గణేష్‌ మండప నిర్వాహకులకు విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు.


దర్శనానంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీమ్ అంతా కలిసి గణనాథుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నేటి ట్రెండ్‌కు తగినట్లు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.


హీరో పిడుగు విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ఈ తరం జెన్-జీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ‘వేదవ్యాస్’ ఉంటుందని స్పష్టం చేశారు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మన వేదాలు, భారతీయ సంస్కృతి ప్రాధాన్యతను చాటిచెప్పే కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. మొదటి చిత్రంతోనే ఇంత పెద్ద దర్శకుడితో పనిచేసే అవకాశం గణనాథుడి దయవల్లే దక్కిందని, వచ్చే ఏడాది నాటికి తనను మంచి హీరోగా నిలబెట్టాలని స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లానింగ్ అదిరింది

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

Updated Date - Sep 22 , 2026 | 08:54 PM