వంశీ చాగంటి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్!
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:24 PM
వంశీ చాగంటి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో స్కంద దర్శకత్వంలో సత్యనారాయణ నాగుల నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు.
'హ్యాపీడేస్' ఫేమ్ వంశీ చాగంటి, నట,దర్శకుడు ధనరాజ్ ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్కంద దర్శకత్వంలో సత్యనారాయణ నాగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సాకీ రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అప్పాజీ, దయానంద్ రెడ్డి, ప్రశాంత్, పద్మారావ్, కేశవి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుపుకుంటోంది. జి. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే సాయి కార్తీక్ సంగీతం, హరి ఎడిటర్ గా చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తామని, అన్ని వర్గాలను అలరించేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు స్కంద తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘కల్కి 2’ షూటింగ్పై అప్డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్
దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?
‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత