గోవాలో షూటింగ్ జరుపుకున్న 'వేల్'!
ABN, Publish Date - Sep 30 , 2026 | 05:07 PM
రవిచంద్ర, ఆదిత్య హీరోలుగా అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'వేల్'. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు నాగమహేశ్ ఆవిష్కరించారు.
రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘వేల్’. ఈ చిత్రాన్ని జి. అశోక్ (రాజు), వై. మురళి (రాజు) నిర్మిస్తున్నారు. డైరెక్టర్ నాగేంద్ర ఆవుల రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో ‘వేల్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు నాగమహేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా మొత్తం షూటింగ్ గోవాలో జరిగింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథ చకచకా సాగిపోతుంది. ఈ కథలో అనేక కోణాలు ఉన్నాయి. స్టోరీలోని ఎలిమెంట్స్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది' అని అన్నారు.
హీరోయిన్ అమృత శ్రీవాత్సవ మాట్లాడుతూ, 'నేను మిస్ ఇండియా విన్నర్ అయ్యాక మిస్ వరల్డ్ పోటీలకోసం సన్నద్ధమవుతూ వచ్చాను. ఆ క్రమంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. నాకు దక్షిణాది చిత్రాలు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇలాంటి ఇండస్ట్రీలో నేనూ భాగమవ్వాలని కోరుకున్నాను. ఈ చిత్రంలో నాయికగా నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశారు. త్వరలోనే మా మూవీ మీ ముందుకు రాబోతోంది' అని చెప్పారు. హీరో రవిచంద్ర మాట్లాడుతూ, 'ఇది స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ. హిట్ కొడుతున్నాం అనే నమ్మకం మాలో ఉంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను డే అండ్ నైట్ షెడ్యూల్స్ లో మా డైరెక్టర్ గారు కష్టపడి రూపొందించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. మరో హీరో ఆదిత్య మాట్లాడుతూ, 'ఒక మనిషి తనకు కావాల్సిన పనులు చేయించుకోవడం కోసం, ఎలాంటి ముసుగులు వేసుకుని ప్రవర్తిస్తున్నాడు? అనే పాయింట్ తో మా డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్ట్స్ సీన్ ఏం జరుగుతుంది అనేది ఊహించలేం. సినిమా మంచి పేస్ తో వెళ్తూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇలాంటి మంచి మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నాను' అని చెప్పారు.
ప్రొడ్యూసర్ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ, 'సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్న చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. టీమ్ అంతా సపోర్ట్ చేసి క్వాలిటీ మూవీ చేసేందుకు కష్టపడ్డారు. మా హీరోలు, హీరోయిన్ ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్' అని చెప్పారు. చివరగా నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ, 'ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని ప్యాషనేట్ గా నిర్మించారు. ఆయనలాంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం. ఇద్దరు యంగ్ ఎనర్జిటిక్ హీరోలు రవితేజ, ఆదిత్య ఈ చిత్రంలో నటించారు. మిస్ ఇండియా అమృత హీరోయిన్ గా ఆకట్టుకోనుంది. ట్రైలర్ చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు
జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం
Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది