బ్రేక్‌ తీసుకోవడానికి కారణం అదే.. వడ్డే నవీన్ ఎమోషనల్!

ABN , Publish Date - May 21 , 2026 | 07:35 PM

వడ్డే నవీన్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అప్పట్లో సక్సెస్ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. మళ్లీ చాలా కాలం తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

Transfer Trimurthulu Teaser Launch Event

వడ్డే నవీన్ (Vadde Naveen).. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అప్పట్లో సక్సెస్ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. మళ్లీ చాలా కాలం తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). కమల్ తేజ నార్ల (Kamal Teja Narla) ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరియం అవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు.


ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ వేడుకలో హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న చనిపోయిన తర్వాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. నేను హైదరాబాద్‌ వదిలి ఎక్కడికి వెళ్లలేదు. ఇక్కడే ఫ్యామిలీతోనే ఉంటున్నాను. కాకపోతే, నేను ఎక్కువగా బయట కనిపించను. కానీ నా గురించి మీడియా, అభిమానులు మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బ్రేక్ తీసుకున్నాను.. తీసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం, నా దగ్గరకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. ఎన్నో కథలు విన్నాను. కానీ, ఏది అంతగా నచ్చలేదు. అందుకే దూరంగా ఉన్నాను.


‘త్రిమూర్తులు’ పాత్ర గురించి, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ మాత్రమే కమల్ చెప్పాడు. అతనితో కలిసి కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయిన తర్వాతే షూటింగ్‌కు వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో ఈ సినిమా ఉంటుంది. కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందరం కలిసి ఓ ఫ్యామిలీలా ఈ మూవీ కోసం పని చేశాం. రాశీ అద్భుతమైన నటి. జూన్ 19న స్ట్రాంగ్ కంటెంట్‌తో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్ర ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత పదేళ్లుగా నేను ఎక్కడా కనిపించకపోయినా, సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. టోవినో థామస్ ఛాన్స్ పట్టేసిన హీరో అతనే!

‘లవ్ యూ కళ్యాణ్’.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Updated Date - May 21 , 2026 | 07:35 PM