సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vaazha 2: 'వాలా 2' విజయం.. టాలీవుడ్ యువ హీరోల ప్రశంసలు 

ABN, Publish Date - Apr 25 , 2026 | 05:53 PM

మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘వాలా 2’ (Vaazha 2) తెలుగులో వీక్షించిన టాలీవుడ్‌ యువ హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘వాలా 2’ (Vaazha 2) తెలుగులో వీక్షించిన టాలీవుడ్‌ యువ హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మలయాళంలో వారం రోజుల్లో దాదాపు రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టి ఈ చిత్రం ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సావిన్ షా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్,  అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్,  వినాయక్ కీలక పాత్రధారులు.  సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై  తెలుగులో ఈ నెల 24న విడుదల చేశారు. చక్కని ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో యూనానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్వహించారు. హీరో సాయి దుర్గ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ  ‘వాలా2 ’ మౌత్‌ టాక్ తో పికప్ అయింది. షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు చాలా మంచి మనసుంది. అన్ని సినిమాలను  ప్రోత్సహిస్తారు. మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు. మంచి సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సాహు గారు ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మీ అందరి సపోర్ట్ తో తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

నిఖిల్‌ మాట్లాడుతూ ‘వాలా 2 నిన్న నేను చూసిన థియేటర్‌ హౌస్‌ ఫుల్‌ అయింది. జనాలు కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నేను కూడా బాగా ఎంజాయ్‌ చేశా. నా హ్యాపీడేస్‌ మలయాళంలో కూడా హిట్‌ అయింది. ఇప్పుడీ ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవ్వాలి. తెలుగు డబ్బింగ్‌ బాగా చేశారు. కొన్ని డైలాగ్స్‌ బాగున్నాయి. సచిన్‌ తరహాలో సాహు వరుస సెంచరీలు కొడుతున్నారు. ఈ సక్సెస్‌ ఇలా కంటిన్యూ అవ్వాలి’ అని అన్నారు. 

సాహు గారపాటి మాట్లాడుతూ ‘ రామ్ చరణ్,  రామ్ పోతినేని, నాగ చైతన్య, ఆర్జీవీ ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.  ఈ చిత్రం నిదానంగా ప్రేక్షకుల్లోకి  వెళ్తుందని ముందే ఊహించాం. కేరళ సినిమాలకు మార్కెట్‌ ఎక్కువ. గల్ప్‌ లాంటి ఏరియాల్లో మలయాళ చిత్రాలు బాగా చూస్తారు. అందువల్లే అక్కడ వసూళ్లు బాగా వస్తాయి. మలయాళ చిత్రాల మేకింగ్‌ స్టైల్‌ వేరుగా ఉంటుంది. సహజంగా ఉంటాయి. అందుకే వారి సినిమాలు  తెలుగులో బాగా ఆడుతున్నాయి అనుకోవచ్చు. మన దగ్గర టిక్కెట్‌ రేట్లు, విపిఎన్‌ చార్జెస్‌ లాంటి వాటి వల్ల కొంత ఎఫెక్ట్‌ ఉంది. వాటిని అధిగమించడానికి చర్చలు నడుస్తున్నాయి. మన దగ్గర రెమ్యూనిరేషన్‌ కాకుండా రిలీజ్‌ తరువాత లాభాల సిస్టం అనేది ఉంది. ఇవన్నీ మారితే అన్ని దార్లోకి వస్తాయి. ఇక వాలా 3.. అమ్మాయిల నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు తర్వాత చెబుతాం’ అని అన్నారు.  

ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు అందరు తెలుగులో సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

 

 

 

Updated Date - Apr 25 , 2026 | 06:00 PM