బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!
ABN, Publish Date - Jul 31 , 2026 | 07:22 PM
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. ఈ మూవీ నుంచి హీరోయిన్ కియారా బర్త్‌డే స్పెషల్‌గా ఓ సరికొత్త పోస్టర్ వదిలారు.
రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరోగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నుంచి బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) పుట్టినరోజు (జూలై 31) స్పెషల్‌గా శనివారం మేకర్స్ స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Happy Birthday Kiara Advani)
ఈ పోస్టర్‌ని గమనిస్తే.. కియారా అద్వానీ ఎరుపు రంగు డిజైనర్ దుస్తుల్లో ఎంతో గ్లామరస్‌గా, రాయల్‌గా కనిపిస్తున్నారు. ఆమె తీక్షణమైన చూపులు, బోల్డ్ రూబీ రెడ్ లిప్‌స్టిక్, రాయల్ మేకప్ అండ్ హెయిర్‌స్టైల్ ఈ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న ‘నాదియా’ పాత్ర వెనుక ఎంతో కాన్ఫిడెన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్, మిస్టరీ దాగి ఉన్నాయనేది ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పోస్టర్‌ని షేర్ చేస్తూ.. ఆమె అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ మరోసారి మ్యాజిక్ చేస్తాడని ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
సంగీత ప్రపంచంలోనూ రాజకీయాలుంటాయని తెలిసొచ్చింది - గాయని జమునారాణి చివరి ఇంటర్వ్యూ
మోక్షజ్ఞ కంటే ముందే.. బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ!