టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ!

ABN , Publish Date - May 09 , 2026 | 03:46 PM

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ (86) నేడు (మే 9, 2026) శనివారం కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Producer Kakarla Krishna

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ (86) నేడు (మే 9, 2026) శనివారం కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన కాకర్ల కృష్ణ (Kakarla Krishna), తన స్వయంకృషితో నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. ఆ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల స్వర్ణోత్సవ వేడుకలను కూడా జరిపారు. ఆయన తొలినాళ్లలో నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు.


‘ఏడంతస్తుల మేడ, ఊరంతా సంక్రాంతి, రాగ దీపం’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. కేవలం సినిమాలే కాకుండా, ‘ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానం’ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. కాకర్ల కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు సినీ ప్రముఖులెందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1974లో కె. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళతో ఆయన నిర్మించిన ‘ఇంటింటి కథ’ చిత్రం.. నిర్మాతగా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. కాకర్ల కృష్ణ మృతి వార్త తెలిసిన వారంతా.. టాలీవుడ్ ఓ మంచి నిర్మాతను కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని (RIP Kakarla Krishna) నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Updated Date - May 09 , 2026 | 03:46 PM