పర్సంటేజ్ సిస్టమ్.. మినహాయింపు కోరుతున్న సినిమాల లిస్ట్ ఇదే!
ABN , Publish Date - May 16 , 2026 | 12:35 PM
‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలుకు గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి తప్పితే, ఎప్పుడూ ఓ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. దీని నిమిత్తమై ఇప్పుడో కమిటీని ఏర్పాటు చేశారు.
‘పర్సంటేజ్ సిస్టమ్’ (Percentage System) అమలుకు గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి తప్పితే, ఎప్పుడూ ఓ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. రీసెంట్‌గా ఈ విధానంపై నిర్మాతల మధ్య ఎలాంటి మాటల యుద్ధాలు నడిచాయో తెలియంది కాదు. వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన ఈ ఇష్యూని క్లియర్ చేసేందుకు టాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. శుక్రవారం ఛాంబర్‌లో సమస్య పరిష్కారం కోసం సమావేశమయ్యారు. నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులతో సమస్య పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
సమస్య పరిష్కారం అవుతుందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఇలా కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యని, పెద్దిదిగా చేసుకుని, బజారున పడటమనేది నిజంగానే హాస్యాస్పదమని చెప్పుకోవాలి. ఈ సమస్యకు అతి త్వరలోనే తగిన పరిష్కారం లభిస్తుందని అంతా ఆశిస్తున్నప్పటికీ.. ఈ పర్సంటేజ్ సిస్టమ్‌ను కొన్ని సినిమాలకు మినహాయించాలని నిర్మాతలు కొందరు కోరుతున్నారు. ఫిలిం ఛాంబర్ మీటింగ్‌లో.. కొన్ని సినిమాలు ఇప్పటికే దాదాపు 50 నుంచి 70 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాయని నిర్మాతలు తెలిపారు. కాబట్టి, ఆ సినిమాలు రిలీజైన తర్వాత అంటే ఏడాదిన్నర వరకు ఆగి.. అప్పుడు పూర్తి స్థాయిలో పర్సంటేజ్ సిస్టమ్‌కు వెళ్దామని తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఛాంబర్ ద్వారా ఏర్పాటైన కమిటీ నిర్ణయం ఏమిటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పర్సంటేజ్ విధానం నుంచి మినహాయింపు కోరుతున్న సినిమాల లిస్ట్ ఇదే!
పెద్ది (Peddi)
ది ప్యారడైజ్
AK47 (వెంకటేష్ - త్రివిక్రమ్)
విశ్వంభర
బాలకృష్ణ 111వ సినిమా
ఫౌజీ
స్పిరిట్ (Spirit)
వారణాసి (Varanasi)
జై హనుమాన్
NTRNeel (ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్)
రాకా
Mega158 (చిరంజీవి - బాబీ)
AA23 (అల్లు అర్జున్ 23వ చిత్రం)
RC17 (రామ్ చరణ్ సుకుమార్ సినిమా)
Kalki Part-2
నాని - సుజీత్ ఫిల్మ్
వెంకీ, కళ్యాణ్ రామ్, అనీల్ రావిపూడి మూవీ
ఇవి కూడా చదవండి:
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!