సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మా ఊరు ఎక్క‌డో స్వ‌ర్గం అండీ.. దిగి వ‌చ్చాం పండ‌గ చేసుకోండి! పాట అదిరింది

ABN, Publish Date - Aug 27 , 2026 | 05:15 PM

అల్ల‌రి న‌రేశ్ దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత త‌న‌కు అచ్చి వ‌చ్చిన కామెడీ జాన‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇస్తూ న‌టించిన నూత‌న చిత్రం రంభ ఊర్వ‌శి మేన‌క.

Ramba Oorvasi Menaka

అల్ల‌రి న‌రేశ్ (Allari Naresh) దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత త‌న‌కు అచ్చి వ‌చ్చిన కామెడీ జాన‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇస్తూ న‌టించిన నూత‌న చిత్రం రంభ ఊర్వ‌శి మేన‌క (Ramba Oorvasi Menaka). సుర‌భి (Surbhi), రాశి సింగ్ (Raashi Singh), ప్రిసా సింగ్ (Prisha Singh), విష్ణు ప్రియ (Vishnu Priya Bhimeneni) క‌థానాయిక‌లుగా న‌టించారు. చంద్రమోహన్ చింతడ (Chandra Mohan) దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌కు వ‌స్తుంది. ఈ నేప‌త్యంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించి టీజ‌ర్, గ్లింప్స , పాట‌లు రిలీజ్ చేయ‌గా అన్నీ మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుని సినిమాపై హైప్స్ అమాంతం పెరిగేలా చేశాయి.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ మా ఊరు ఎక్క‌డో స్వ‌ర్గం అండీ.. అది ఆకాశం అంచున ఉంట‌దండీ.. అరే దిగి వ‌చ్చాం పండ‌గ చేసుకోండి అంటూ సాగే హుషారైన డ్యాన్స్ పెంబ‌ర్‌ను రిలీజ్ చేశారు. సురేశ్ బానిషెట్టి (Suresh Banisetti) అందించిన ఈపాట‌ను చేత‌న్ భ‌ర‌ద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతంలో సాహితి చాగంటి (Sahithi Chaganti), ధ‌నుంజ‌య్ సిపాన (Dhanunjay Seepana) ఆల‌పించారు. విజ‌య్ పొలంకి నృత్య రీతులు స‌మ‌కూర్చ‌గా క‌థానాయిక‌లు రాశి సింగ్‌, ప్రిసా సింగ్‌, విష్ణు ప్రియ హీరో న‌రేశ్‌పై చిత్రీక‌రించారు. పాట‌లోని సాహిత్యంతో పాటు న‌లుగురు క‌లిసి చేసిన డ్యాన్స్ అన్నీ అదిరిపోయాయి. ప్ర‌స్తుతం ఈ పాట సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Aug 27 , 2026 | 05:15 PM