టైర్ 2 హీరోస్ థియేట్రికల్ బిజినెస్.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్!

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:31 PM

టాలీవుడ్ టైర్ 2 హీరోస్ థియేట్రికల్ బిజినెస్ సైతం యాభై కోట్లు దాటుతోందంటే.. వారికి కూడా క్రేజ్ ఉందని ఆనందించవచ్చు. అయితే అందుకు తగ్గ రాబడి రాకపోతే వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Tollywood Tier 2 Heroes

టాలీవుడ్ టైర్ 2 హీరోస్ థియేట్రికల్ బిజినెస్ సైతం యాభై కోట్లు దాటుతోందంటే.. వారికి కూడా క్రేజ్ ఉందని ఆనందించవచ్చు. అయితే అందుకు తగ్గ రాబడి రాకపోతే వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.. ఆ ముచ్చటేంటో చూద్దాం. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద ప్యారడైజ్’ (The Paradise) మూవీ బడ్జెట్ రూ. 200 కోట్లని తెలుస్తోంది. ఈ చిత్రానికి బజ్ క్రియేట్ అయింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని తెలుస్తోంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇంతకు ముందు వచ్చిన ‘దసరా’ చిత్రం థియేటర్లలోనూ సందడి చేసింది. ఆ కారణంగానే ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ. 103 కోట్లు జరిగిందని తెలుస్తోంది. ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా మరో వంద కోట్లకు పైగా పోగేస్తుందని, అందువల్ల ఈ చిత్రానికి లాస్ అన్న మాటే ఉండదనీ కొందరు అంటున్నారు. అయితే థియేటర్స్ ద్వారా ‘ద ప్యారడైజ్’ ఎంత లేదన్నా.. కనీసం 180 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే సినిమాను సక్సెస్ కేటగిరీలో చేరుస్తారని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. టాలీవుడ్ టూ టైర్ హీరోస్‌గా పేరొందిన నాని, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్, అఖిల్, నాగ చైతన్య వంటి హీరోల ప్రీరిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే ‘ద ప్యారడైజ్’ అన్నిటి కన్నా మిన్నగా నిలచింది.


మొన్నటి వరకు టూ టైర్ హీరోస్‌లో హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మూవీగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ నిలచింది. ఈ మూవీ 88 కోట్ల 40 లక్షల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ తరువాతి స్థానంలోనూ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘కింగ్ డమ్’ 54 కోట్ల బిజినెస్‌తో నిలచింది. ఆ తరువాతి స్థానం కూడా విజయ్ నటించిన ‘ఖుషి’ చిత్రం 52 కోట్ల బిజినెస్‌తో ఉంది. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాయి. మరో విశేషమేంటంటే టూ టైర్ హీరోస్ టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో నాలుగు చిత్రాలు విజయ్ దేవరకొండవే ఉండడం విశేషం. ఆయన నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సైతం 43 కోట్ల బిజినెస్ చేసింది.. అది కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో నాని నటించిన ‘ద ప్యారడైజ్’ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవగా, ఐదో స్థానంలో ‘దసరా’ 50 కోట్ల బిజినెస్‌తో నిలచింది. ఆ తరువాతి స్థానంలోనూ నాని నటించిన ‘హిట్-3’ ఉంది. ఇది రూ. 48.5 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. మిగిలిన మూడు చిత్రాల్లో రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ 48 కోట్లతో ఏడో స్థానంలోనూ, ‘స్కంద’ 46 కోట్లతో ఎనిమిదో స్థానంలోనూ నిలిచాయి. పదో స్థానంలో అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ (Akhil) 42 కోట్లతో ఉంది. ఈ చిత్రాల సక్సెస్ రేట్ చూస్తే నాని నటించిన ‘దసరా, హిట్-3’ మాత్రమే థియేటర్స్ లోనూ అలరించాయి. మిగిలిన ఏడు చిత్రాలు పరాజయం బాట పట్టినవే కావడం గమనార్హం.


టూ టైర్ హీరోస్ ప్రీరిలీజ్ బిజినెస్ టాప్ టెన్‌లో ‘ద ప్యారడైజ్’తో కలిపి నాని నటించిన మూడు చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ జాబితాలో నిలచిన నాని సినిమాలు ‘దసరా, హిట్-3’ ప్రేక్షకులను మురిపించాయి. కాబట్టి రాబోయే ‘ద ప్యారడైజ్’ కూడా జనాన్ని ఆకట్టుకుంటుందని సినీ ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు. టూ టైర్ హీరోస్‌లో నాని తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ఏదో ఒకరోజు బంపర్ హిట్‌ను సొంతం చేసుకుంటే.. ఆయన కూడా మరింత పై స్థానం చేరుకొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24న రాబోతున్న ‘ద ప్యారడైజ్’ నానికి ఎలాంటి సక్సెస్‌ చూపిస్తుందో చూద్దాం..

ఇవి కూడా చదవండి:

‘జాంబీ రెడ్డి 2’లో రియల్ స్టార్ ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ చూస్తే వణకాల్సిందే

ఈ పాట కోరిన వారు... మూవీ రివ్యూ

పవన్ కళ్యాణ్‌‌తో ఒకే ఒక్క ఛాన్స్.. : నటి కావ్యశ్రీ

Updated Date - Sep 18 , 2026 | 06:31 PM