సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మా ‘రెడ్ బుక్’లా.. ఈ ‘ది రెడ్ బ్యాగ్’ ఇండియా అంతా సౌండ్ చేయాలి: ఏపీ మంత్రి

ABN, Publish Date - Jun 22 , 2026 | 11:17 PM

మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు రూపొందిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

The Red Bag teaser Launch

మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి (Hari Krishna Somisetty) నిర్మాణంలో రవి కుమార్ సీరపు (Ravi Kumar Seerapu) రూపొందిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ (T. G. Bharath) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.


టీజర్ విడుదల అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ చాలా బాగుంది. హిట్ కళ కనిపిస్తోంది. మా కర్నూలు నుంచి వచ్చిన హరి తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. మా రెడ్ బుక్ గురించి ఇండియా వ్యాప్తంగా తెలుసు. అలానే ఈ ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ కూడా ఇండియా అంతా సౌండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలులోనే అత్యధిక భాగంగా షూటింగ్ చేశారని తెలిసింది. కానీ, టీజర్ చూస్తుంటే ఫారిన్‌లో తీసినట్టుగా కనిపిస్తోంది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం మంచి విజయం సాధించి మా హరికి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ..ఇలాంటి వినూత్న చిత్రాలు తప్పకుండా విజయవంతం అవ్వాలి. హరికి ఈ చిత్రం హిట్ అయితే మరిన్ని కొత్త సినిమాల్ని నిర్మిస్తారు. ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ చూసి నేను షాక్ అయ్యాను. నెక్ట్స్ లెవెల్లో సినిమా ఉండబోతోందని అర్థమైంది. ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలని కోరుకుంటూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ.. ‘ది రైడ్ బ్యాగ్’ చిత్రం లైఫ్ టైమ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఎక్కడ రెడ్ బ్యాగ్‌ని చూసినా మా ‘ది రెడ్ బ్యాగ్’ సినిమానే గుర్తుకు వస్తుంది. ఇండస్ట్రీలో నా పదహారేళ్ల నిరీక్షణ తర్వాత నాకీ అవకాశం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరికి థాంక్స్. మాకోసం ఇక్కడకు వచ్చిన ఏపీ మినిస్టర్ భరత్‌కు, మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. కథ విన్న వెంటనే నిర్మాత ఓకే చెప్పేశారు. మా సినిమాకి కథే హీరో. దాదాపు షూటింగ్ అంతా కర్నూలులో చేశాం. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ హిట్ చేస్తారు. ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం. అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!

ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Updated Date - Jun 22 , 2026 | 11:17 PM