సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు

ABN, Publish Date - Oct 04 , 2026 | 04:12 PM

కొత్త దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే రవి కుమార్ సీరపు తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. ‘ది రెడ్ బ్యాగ్’ అందించిన ప్రారంభంతో రవి కుమార్ సీరపు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Director Ravi Kumar Seerapu

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి తీసుకువచ్చారు. టాలెంటెడ్ యువ దర్శకుడు రవి కుమార్ సీరపు (Ravi Kumar Seerapu) తెరకెక్కించిన ఈ సినిమా.. కథాంశం, మేకింగ్, గ్రిప్పింగ్ ట్రీట్‌మెంట్‌తో ఆడియన్స్‌తో పాటు సినీ విశ్లేషకుల దృష్టిని సైతం ఆకర్షించింది.


ఒక కొత్త దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే రవి కుమార్ సీరపు తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా, కథలో భావోద్వేగాలను, మంచి సందేశాన్ని సమపాళ్లలో మేళవిస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించిన తీరు ఆయన దర్శకత్వ ప్రతిభను, విజన్‌ను స్పష్టంగా ప్రతిబింబించింది. ముఖ్యంగా స్టైలిష్ మేకింగ్, విజువల్స్, సన్నివేశాలను తెరపై ప్రజెంట్ చేసిన విధానం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. కంటెంట్‌ను ఏమాత్రం పక్కదారి పట్టించకుండానే, కమర్షియల్ హంగులను జోడించి కథను చెప్పడంలో రవి కుమార్ చూపించిన ప్రతిభ ప్రశంసలు అందుకుంది. ఈ విజయంతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ డైరెక్టర్ల జాబితాలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.


మరింత పెద్ద కాన్వాస్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్

‘ది రెడ్ బ్యాగ్’ అందించిన విజయవంతమైన ప్రారంభంతో రవి కుమార్ సీరపు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మరింత వైవిధ్యమైన, ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తొలి చిత్రానికంటే మరింత పెద్ద కాన్వాస్‌పై, భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మొదటి ప్రయత్నంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. తన తదుపరి చిత్రంతో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..

ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత

Varanasi: మహేష్ ‘రుద్ర’ పాత్రపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Updated Date - Oct 04 , 2026 | 04:12 PM