సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యూఎస్ మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డు.. మహేష్ సరసన నాని!

ABN, Publish Date - Sep 23 , 2026 | 06:24 PM

బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ నాని విధ్వంసం మొదలైంది. ఆయన హీరోగా నటించిన తాజా మాసివ్ చిత్రం ‘ద ప్యారడైజ్’ విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించింది.

Mahesh and Nani US Box Office Record

బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) విధ్వంసం మొదలైంది. ఆయన హీరోగా నటించిన తాజా మాసివ్ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise) విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించింది. ‘దసరా’ (Dasara) వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం, దానికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరడంతో ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఇప్పటికే రూ. 43 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేయగా, సెప్టెంబర్ 23న ప్రీమియర్లతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెడుతోంది.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో నాని మార్కెట్ స్టామినా మరోసారి ఘనంగా రుజువైంది. అమెరికా మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ చిత్రం కేవలం ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌తోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డును నమోదు చేసిందని పంపిణీదారులు అధికారికంగా వెల్లడించారు. ఈ ఘనతతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక 1 మిలియన్ డాలర్ల చిత్రాలు కలిగిన రికార్డులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని సగర్వంగా నిలిచారు. ఇద్దరి ఖాతాల్లోనూ చెరో 12 చిత్రాలు చేరడం విశేషం.


యూఎస్ బాక్సాఫీస్ (US Box Office) చరిత్రలో 1 మిలియన్ డాలర్ల చిత్రాలు కలిగిన తెలుగు హీరోల జాబితా:

మహేష్ బాబు: 12

నాని: 12

ఎన్టీఆర్: 9

పవన్ కళ్యాణ్: 9

ప్రభాస్: 8

అల్లు అర్జున్: 6

నందమూరి బాలకృష్ణ: 6

మెగాస్టార్ చిరంజీవి: 5

విజయ్ దేవరకొండ: 5

రామ్ చరణ్: 5

వెంకటేష్: 4

వరుణ్ తేజ్: 4

నవీన్ పోలిశెట్టి: 3

నాగార్జున: 3

అడివి శేష్: 3

సాయి ధరమ్ తేజ్: 2

నాగ చైతన్య: 2

తేజ సజ్జా: 2

నితిన్, శ్రీవిష్ణు, అఖిల్, నిఖిల్, మౌళి, రవితేజ: ఒక్కొక్క చిత్రం


కంటెంట్‌ను నమ్ముకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన నాని, నేడు స్టార్ హీరోలందరినీ దాటుకుంటూ యూఎస్ మార్కెట్‌లో అగ్రపీఠాన్ని మహేష్ బాబుతో పంచుకోవడం ఆయన ఓవర్సీస్ ఫ్యాన్ బేస్‌కు నిదర్శనం. ప్రీమియర్లతోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడంతో, రానున్న రోజుల్లో ‘ద ప్యారడైజ్’ మరిన్ని భారీ కలెక్షన్లతో చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

46 కోట్లు.. రాధ ఫిర్యాదుపై సోదరి అంబిక సవాల్

జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు షాక్.. ఆమె కార్యవర్గం రద్దు

బాలయ్య సరికొత్త అవతార్.. కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

Updated Date - Sep 23 , 2026 | 06:24 PM