సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ టీమ్ చేయాల్సింది ఇదేనా..

ABN, Publish Date - Sep 24 , 2026 | 09:16 PM

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు ఉన్న అంచనాలు, క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రీ-బుకింగ్స్ సమయంలో హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు చూసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించాయి.

The Paradise Movie Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise).. గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి ఉన్న అంచనాలు, క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రీ-బుకింగ్స్ సమయంలో హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు చూసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే, మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలిరోజు కనిపించిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. ఆ తర్వాత మెల్లగా నెమ్మదించడం మొదలైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు కొన్ని అంశాలు కనెక్ట్ కాకపోవడంతో బుకింగ్స్ వేగం తగ్గింది.


ప్రస్తుతం నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే చిత్ర నిర్మాణ సంస్థ వెంటనే మేల్కోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడీ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేకర్స్ ముందున్న ఏకైక మార్గం ‘టికెట్ ధరలను తగ్గించడమే’నని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో హైక్ చేసిన అధిక టికెట్ రేట్లు అమలులో ఉన్నాయి. సాధారణంగానే మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పుడు అధిక టికెట్ ధరలు సాధారణ ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేస్తాయి. అదే కనుక టికెట్ ధరలను సాధారణ రేట్లకు తీసుకొస్తే.. టికెట్ భారం తగ్గి సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు కదిలివచ్చే అవకాశం ఉంటుంది.


ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం సాధారణ టికెట్ ధరలతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆక్యుపెన్సీ సాధించి, ఏకంగా రూ. 200 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించిన ఉదాహరణను ఈ సందర్భంగా ట్రేడ్ పండితులు గుర్తుచేస్తున్నారు. ‘ద ప్యారడైజ్’ను సైతం అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన నేపథ్యంలో.. బడ్జెట్ రికవరీ కావాలన్నా, వచ్చే మొదటి వీకెండ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నా ధరల తగ్గింపు తక్షణ ఆయుధంగా మారుతుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. హిట్ టాక్ వచ్చి ఉంటే అధిక ధరలతోనే వసూళ్లు పోటెత్తేవి, కానీ పరిస్థితి భిన్నంగా ఉన్న వేళ మేకర్స్ తీసుకునే నిర్ణయాలే సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయి. మరి ఈ పరిస్థితిని గ్రహించి ‘ద ప్యారడైజ్’ బృందం తక్షణమే టికెట్ ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘ద ప్యారడైజ్’ వచ్చేది ఏ ఓటీటీలో అంటే..

శర్వా ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదల.. ఎలా ఉందంటే

బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్.. ఇది నటసింహం రేంజ్!

Updated Date - Sep 24 , 2026 | 09:16 PM