సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..

ABN, Publish Date - Sep 27 , 2026 | 01:38 PM

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు రాబట్టిన కలెక్షన్ల వివరాలను మేకర్స్ తెలిపారు.

The Paradise Collections

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలనిజం, అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ తోడై ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మాస్ జాతరను తలపిస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తర్వాత షో షోకీ పుంజుకుంటూ కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


ఈ క్రమంలో మొదటి మూడు రోజుల (గురు, శుక్ర, శని) కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారిక పోస్టర్ల ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ద ప్యారడైజ్’ కేవలం 3 రోజుల్లోనే ఏకంగా రూ. 136 కోట్ల గ్రాస్ (GBOC) వసూళ్లను సాధించి నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది. ‘జడల్ జమానా టేకోవర్’ అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

నార్త్ అమెరికాలోనూ దూకుడు

కేవలం తెలుగు రాష్ట్రాలు, దేశీయ మార్కెట్లలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ నాని తన బాక్సాఫీస్ సత్తాను చాటుతున్నారు. నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ ద్వారా విడుదలైన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే 1.95 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.


మిక్స్‌డ్ టాక్‌ను సైతం లెక్కచేయకుండా ‘ద ప్యారడైజ్’ ఈ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నాని మాస్ యాక్టింగ్, థియేటర్లలో మోగుతున్న అనిరుధ్ బీజీఎం, సమ్మక్క ఎమోషన్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆదివారం కూడా హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో సాగుతుండటంతో మొదటి నాలుగు రోజుల ముగింపు సమయానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే

తెలుగులో థియేట‌ర్ల‌కు.. కీర్తి సురేశ్, స‌నంత్‌ లెస్బియ‌న్ మూవీ

దర్శకుడు ప్రదీప్‌ అద్వైతంకు భార్యావియోగం

Updated Date - Sep 27 , 2026 | 01:38 PM