సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sriram: సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'ది మేజ్‌'

ABN, Publish Date - Jul 25 , 2026 | 12:55 PM

శ్రీరామ్, ప్రియంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ది మేజ్'. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని డాక్టర్ అనిరుధ్‌ రెడ్డి తెరకెక్కించారు.

The Maze Movie

ఇటీవల విడుదలైన జగపతిబాబు చిత్రం 'వదల'లో కీలక పాత్ర పోషించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హృతికా శ్రీనివాస్. ప్రముఖ నటి ఆమని మేనకోడలు అయిన హృతిక దీనికి ముందు కూడా కొన్ని చిత్రాలలో నటించింది. ఆమె తాజా చిత్రం 'ది మేజ్' విడుదలకు సిద్ధమౌతోంది. ప్రముఖ హీరో శ్రీరామ్ (శ్రీకాంత్‌), ప్రియాంక, కమల్ కామరాజ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో డాక్టర్ ఉదయ్ కె రెడ్డి పాల్వాయి, డాక్టర్ కె.ఎస్.ఆర్., డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్‌ రెడ్డి సోమ ఈ సినిమా నిర్మించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను డాక్టర్ రవికిరణ్ గడలాయ్ డైరెక్ట్ చేశారు.


ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 'ది మేజ్‌' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండగా, వారి బ్యాక్ డ్రాప్ లో ఒక మహానగరాన్ని చూపించారు. లీడ్ యాక్టర్స్ అంతా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. న్యూ ఏజ్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీని చూడబోతున్నామనే ఇంప్రెషన్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతోంది.


సినిమా గురించి దర్శకుడు డాక్టర్ డాక్టర్ రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ, 'వాస్తవం – భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం మీ ఆలోచనలను సవాలు చేసే, జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా మా సినిమాను రూపొందిస్తున్నాం. చివరి క్షణం వరకు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊహించలేని విధంగా తెరకెక్కించిన మా సినిమా కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం మనసులో నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రముఖ డైరెక్టర్ మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

విద్యార్థుల పోరాటానికి సినీ ప్రముఖుల సంఘీభావం

సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై

Updated Date - Jul 25 , 2026 | 01:31 PM