థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గట్టి పోటీ
ABN, Publish Date - Mar 02 , 2026 | 04:25 PM
ఒకరేమో వరుస విజయాలు చూస్తూ సాగుతున్నారు - మరొకరు తెలుగులో చివరగా వెయ్యికోట్లు చూసిన సినిమాకు పనిచేసిన వారు... ఈ ఇద్దరు సంగీత దర్శకుల మధ్య ప్రస్తుతం పోటీ సాగుతోంది... దాంతో మధ్యలో మరికొందరికి అవకాశాలూ లభిస్తున్నాయని టాక్.
తెలుగు సినిమారంగంలో స్టార్ మూవీస్ కు కంపోజ్ చేస్తూ వరుస విజయాలు చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనగానే థమన్ పేరే గుర్తుకు వస్తుంది... ఇక మన తెలుగు సినిమాల్లో చివరగా వెయ్యి కోట్లు చూసిన చిత్రం 'పుష్ప-2' - ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్... ఈ ఇద్దరు సంగీత దర్శకుల మధ్య గట్టి పోటీ సాగుతోందని పరిశీలకులు అంటున్నారు... అయితే భారీ విజయం నమోదు చేసిన దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప-2' ఘనవిజయం తరువాత తన రెమ్యూనరేషన్ ను 12 కోట్లకు పెంచేశారట... అంతేకాదు, అందుకు అదనంగా జీయస్టీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట... దాంతో ఎక్కువ మంది నిర్మాతలు థమన్ వైపే మొగ్గు చూపిస్తున్నారని టాక్... పైగా బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ తో పాటు యంగ్ హీరోస్ చిత్రాలకు సైతం థమన్ స్వరకల్పన చేస్తున్నారు... ఈ యేడాది కూడా ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ కు థమన్ బాణీలు సమకూరుస్తూ ఉండడం విశేషం...
థమన్ బిజీగా ఉండడం, దేవిశ్రీ ప్రసాద్ భారీగా డిమాండ్ చేస్తూ ఉన్న కారణంగానే తెలుగు నిర్మాతలు పరభాషా సంగీత దర్శకులవైపు చూస్తున్నారని టాక్... మన తెలుగు సినిమా ఇప్పుడే కాదు 1950ల నుంచీ కొన్నేళ్ళ క్రితం దాకా విశ్వనాథన్- రామ్మూర్తి, కేవీ మహదేవన్, ఇళయరాజా వంటివారి బాణీలతో సాగింది... తరువాత వచ్చిన మన తెలుగు సంగీత దర్శకులు రాజ్-కోటి, కీరవాణి, మణిశర్మ అనేక మ్యూజికల్ హిట్స్‌తో తెలుగువారిని పులకింప చేశారు... ఆ సమయంలో పరభాషా సంగీత దర్శకుల వైపు మన తెలుగు సినీజనం చూసింది తక్కువనే చెప్పాలి... అయితే మన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ డిమాండ్స్ కారణంగా ఇప్పుడు కూడా ఇతర సంగీత దర్శకుల వైపు పయనిస్తున్నారు తెలుగు సినీజనం... అనిరుధ్ రవిచందర్ కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నవారు ఆయనను ప్రిఫర్ చేస్తున్నారు... తక్కువలోనే మంచి నాణ్యమైన సంగీతం అందిస్తారని యువన్ శంకర్ రాజా వైపు సాగుతున్నారు కొందరు... 'మన శంకరవరప్రసాద్ గారు'తో మ్యూజికల్ హిట్ పట్టేసిన భీమ్స్ పదనిసలతోనూ పయనించాలని పలువురు ఆశిస్తున్నారు... ఇలా తమకు అనువైన సంగీత దర్శకులను ఎంచుకోవడానికి తెలుగు సినీజనం ఆశిస్తూ ఉన్నారు...
ఒకరిద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పైనే ఆధారపడటం వల్ల పారితోషికాలు బాగా పెరిగిపోతున్నాయి... వారికి దీటుగా సంగీతం సమకూర్చేవారు కనిపించడం లేదు... దాంతో ఇతరుల వెంటపడక తప్పడం లేదు... భీమ్స్ లాంటివారు కూడా బిజీ అయిపోతున్నారు... ఈ కారణంగా పరభాషా సంగీత దర్శకులతోనే సాగాలని టాలీవుడ్ జనం ఆశిస్తున్నారు... దేవిశ్రీ ప్రసాద్ ఈ పరిస్థితిని అధ్యయనం చేసి కాస్త తగ్గితే బాగుంటుందని అభిమానుల అభిలాష... ఈ గ్యాప్ లో ఎవరైనా కొత్త సంగీతదర్శకుడు సత్తా చాటుకోగలిగితే అతని వెంట పడతారు మన సినీజనం... మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి...
Read Also: టాక్సిక్: సాంగ్ బావుంది.. వీడియో కూడా ఉంటే ఇంకా బావుండేది
Read Also: విజయ్.. ఇక్కడ పెళ్లి.. అక్కడ విడాకులు