వంశీ ‘అన్వేషణ’ తరహాలో ‘తత్వం’.. ట్రైలర్‌ అదిరింది

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:05 PM

మర్డర్‌ మిస్టరీ జానర్‌లో.. ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘తత్వం’. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Tatvam Movie Still

మర్డర్‌ మిస్టరీ జానర్‌లో.. ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘తత్వం’ (Tatvam). దినేష్‌ తేజ్‌ (Dinesh Tej), దష్విక.కె (Dhasvika Kinthalli) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల (Arjun Kola) దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సైతాన్ సంతానమే గ్రహణం రోజు పుట్టి సైకోలుగా ప్రవర్తిస్తుంటారనే పాయింట్‌ని బేస్ చేసుకుని, ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. అలాంటి టైమ్‌లో పుట్టిన ఓ వ్యక్తి చేసే హత్యల చుట్టూ కథని నడిపిస్తూ.. నిజంగా ఆ హత్యలను ఆ వ్యక్తే చేస్తున్నాడా? లేదంటే వేరే ఎవరైనా చేయిస్తున్నారా? అనే క్యూరియాసిటీని పెంచేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Tatvam-Trailer-Launch.jpg

ఇక ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం (Tatvam Trailer Launch Event)లో నిర్మాతలు మాట్లాడుతూ.. ట్రైలర్‌ అందరికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాము. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. దర్శకుడు అర్జున్.. అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వస్తుందని నమ్ముతున్నాము. ఈ సినిమాకు మంచి అవుట్‌ పుట్‌ రావడానికి అందరూ ఎంతగానో సహకరించారు. అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని తెలిపారు. దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ.. ఈ మూవీ టైటిల్‌, కాన్సెప్ట్‌.. మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా తయారుచేశాను. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఇది. దినేష్‌ తేజ్‌ వినగానే ఓకే చేశారు. ఈ సినిమా కోసం అందరూ ది బెస్ట్‌ ఇచ్చారు. కథ తప్పకుండా అందరినీ ఎంగేజ్ చేస్తుందని నమ్ముతున్నాను. వంశీ ‘అన్వేషణ’ చిత్ర తరహాలోనే అందరినీ ఉత్కంఠతో కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు.


హీరో దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ.. నేను కలిసి పని చేయాలనుకున్న సాంకేతిక నిపుణులతో ఈ సినిమాకు వర్క్‌ చేశాను. ఈ సినిమాతో చాలా మంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందరం చాలా కష్టపడ్డాం. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఇక మీద నా సినిమాలకు గ్యాప్‌ రాదు. ఈ ‘తత్వం’ తర్వాత నేను సినిమాలతో బిజీ అవుతున్నాను. నా కెరీర్‌కు ఇది టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది. అందరి సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సో.. అలాంటి బలమైన కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్‌ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

జక్కన్న షాక్‌ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

Updated Date - Jun 26 , 2026 | 06:05 PM