'టాల్కమ్ పౌండర్'తో మరోసారి శివ కందుకూరి!
ABN, Publish Date - Sep 30 , 2026 | 04:44 PM
రాజ్ కందుకూరి తాజా చిత్రం 'టాల్కమ్ పౌడర్' నవంబర్ 13న విడుదల కాబోతోంది. శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో సాయినాథ్ పొన్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
'పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో' చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి. ఆయన కుమారుడు శివ కందుకూరి 'చూసీ చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'గమనం, మనుచరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాలలో నటించారు. 'మనమే, అనగనగా' చిత్రాలలోనూ ప్రధాన పాత్రలు పోషించిన శివ 'మీట్ క్యూట్, దేవిక అండ్ డానీ' వెబ్ సీరిస్‌లలో నటించారు. శివ కందుకూరి నటించిన తాజా చిత్రం 'టాల్కమ్ పౌడర్'.
డ్రగ్స్ పెడ్లర్స్ నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ డ్రామాతో సాయినాథ్ పొన్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ద్రిషిక చందర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృష్ణ కమల్, జీవన్, వెంకటేశ్ మహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను బుధవారం మేకర్స్ ప్రకటించారు. 'టాల్కమ్ పౌండర్' మూవీని నవంబర్ 13న విడుదల చేయబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం
Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది
బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆపడం కష్టమే!