సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

ABN, Publish Date - Jul 29 , 2026 | 02:27 PM

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య, భారతదేశపు మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది

Suriya and Rajamouli

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య (Suriya), భారతదేశపు మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇటీవల చర్చలు జరిగాయని, అతి త్వరలోనే ఈ సంచలనాత్మక కాంబినేషన్‌కు సంబంధించిన ప్రకటన రానుందనే ఊహాగానాలు సినీ ప్రియులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టత రానప్పటికీ.. ‘బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR)’ చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలిపిన రాజమౌళి, వైవిధ్యమైన నటనకు చిరునామాగా నిలిచే సూర్యతో జతకడితే భారతీయ చిత్రసీమలో సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


ప్రస్తుతం హీరో సూర్య ‘కరుప్పు’ సినిమా ఘన విజయంతో మంచి జోరుమీదున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న ‘సూర్య 47’, ‘సూర్య 48’, ‘సూర్య 49’ ప్రాజెక్ట్‌లపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో, సూర్య ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సూర్య 50’ (Suriya50)ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి కాంబినేషన్‌ అనేది కేవలం ఒక సినిమా కాదని, ఒక అతిపెద్ద విజువల్ వండర్ కాబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఎక్కడ చూసినా సూర్య, ఎస్.ఎస్. రాజమౌళి, ‘సూర్య 50’, టాలీవుడ్-కోలీవుడ్ బిగ్గెస్ట్ కొల్లాబరేషన్ గురించిన హ్యాష్‌టాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. గ్లోబల్ రేంజ్ మేకింగ్‌కు పేరుగాంచిన జక్కన్న, ఎలాంటి పాత్రలోనైనా జీవించగల సూర్య కలయిక నిజమైతే, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా మారడంలో సందేహం లేదు. ఈ డ్రీమ్ కాంబినేషన్ నిజం కావాలని ఇరు పరిశ్రమల ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో? ప్రస్తుతానికైతే ఈ కాంబోపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. మరోవైపు సూర్య తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ ప్రాజెక్ట్ చిత్రీకరణలో తలమునకలై ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

మోహన్‌ రాజా సరికొత్త అవతారం.. ఈ ట్విస్ట్ ఏంటి

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

Updated Date - Jul 29 , 2026 | 02:27 PM