Surekha Vani: జిమ్‌లో హాట్ హాట్ వర్కౌట్స్.. మళ్లీ  రాబోతుందా?

ABN , Publish Date - Aug 11 , 2026 | 06:47 AM

టాలీవుడ్ లోక్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి.  ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా తల్లి, ఆంటీ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు.

Surekha Vani

టాలీవుడ్ లోక్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి(Surekha Vani).  ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా తల్లి, ఆంటీ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా సురేఖ వాణి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన ‘కెజెక్యూ’ సినిమాలో హీరోయిన్ యుక్తి కి అండగా నిలిచే ఆంటీ పాత్రలో కనిపించారు. ఈ సినిమా మినహా ఇటీవలి కాలంలో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా అవకాశాలు కనిపించలేదు. మరో పక్క కూతురు సుప్రీతను హీరోయిన్‌గా పరిచయం చేసి ఆమె కెరీర్‌ను నిలబెట్టేందుకు సురేఖ వాణి కొంతకాలం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సుప్రీతకు అవకాశాలు తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.  దీంతో ఇప్పుడు సుప్రీత కెరీర్‌తో పాటు తన సినీ ప్రయాణంపైనా సురేఖ వాణి మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

జిమ్‌లో హాట్ వర్కౌట్స్!

ప్రస్తుతం సురేఖ వాణి ఫిట్నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సురేఖ వాణి ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న శ్రద్ధ, ఎనర్జీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. 'ఆంటీ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారా?”, “ఫిట్‌నెస్ చూస్తుంటే ఇంకా హీరోయిన్‌లానే ఉన్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

వయసుపై కన్ఫ్యూజన్!

సురేఖ వాణి వయసు విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలాకాలంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆమె తన వయసు 43 ఏళ్లు అని చెబుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని ఆన్‌లైన్ వేదికల్లో ఆమె వయసు 48గా కనిపిస్తుండగా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆమె వయసు 50కి దగ్గరగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు  25 ఏళ్ళ కూతురు సుప్రీత ఉంది. తల్లి, కూతురు ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు.  కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణి ఇప్పుడు మళ్లీ ఫిట్నెస్‌పై ఫోకస్ పెట్టడం చూస్తుంటే.. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా? అనే ఆసక్తి మొదలైంది. తాజా జిమ్ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. 

Updated Date - Aug 11 , 2026 | 07:13 AM