సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు

ABN, Publish Date - Sep 30 , 2026 | 03:40 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలతా దేవి డిమాండ్ చేశారు.

Sumalatha Devi Complaint on Vallabhaneni Anil

తెలుగు సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్, డ్యాన్సర్స్ యూనియన్ వివాదం మరింత ముదిరింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌ (Vallabhaneni Anil Kumar)ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య (Jani Master Wife), డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలతా దేవి (Sumalatha Devi) డిమాండ్ చేశారు. చిత్రపురి సాధన కమిటీ సభ్యులంతా కలిసి బుధవారం తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ అశోక్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుమలతతో పాటు చిత్రపురి సాధన కమిటీ ప్రతినిధులు ఫెడరేషన్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రధాన డిమాండ్లు, ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి.


అనిల్‌ను తొలగించాలి

ఫిల్మ్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్‌లో తీవ్ర అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలోనూ భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని అనిల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని, ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జానీ మాస్టర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

వ్యక్తిగత కక్షలతో, కుట్రపూరితంగా జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్షన్, సహాయ నిరాకరణలను (నాన్ కో-ఆపరేషన్) వెంటనే ఎత్తివేయాలని కోరారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైతే కొందరు ఓర్వలేకపోతున్నారు. మహిళ అధ్యక్షురాలిగా ఉండటాన్ని తట్టుకోలేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ యూనియన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే.. ఏకంగా అసోసియేషన్‌నే లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.


ఫెడరేషన్ పేరు చెప్పుకుని యూనియన్లను, సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిత్రపురి కాలనీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని, యూనియన్లలో పారదర్శకత తీసుకురావాలని కోరుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుందో..

24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ వ్యవహారం, డ్యాన్సర్స్ యూనియన్ వివాదం, చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఆరోపణలు ఒకేసారి తెరపైకి రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. బాధితులు, కార్మిక సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది

ఇవి కూడా చదవండి:

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం

Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది

బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆప‌డం క‌ష్ట‌మే!

Updated Date - Sep 30 , 2026 | 04:11 PM