సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘మండాడి’కి యుబైఏ.. విడుదలకు సిద్ధం

ABN, Publish Date - Sep 09 , 2026 | 06:14 PM

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది.

Mandaadi Ready to Release

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై సుహాస్ (Suhas), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’ (Mandaadi). మతిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఇక ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమాపై హైప్‌ను పెంచేయగా.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాను చూడాలనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.


తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైంది. సెన్సార్ సభ్యుల నుంచి యుబైఏ సర్టిఫికెట్‌ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. మూవీ అద్భుతంగా వచ్చిందని, బోట్ సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని సెన్సార్ టీం అభినందించడంతో.. టీమ్ కూడా సినిమాపై చాలా నమ్మకంతో ఉంది. ‘మండాడి’ సినిమాకు కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయిని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని చిత్రయూనిట్ కోరింది.


తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బుక్ మై షోలో గంటకు వందల, వేల టికెట్లు తెగుతుండటంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. సుహాస్, సూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చే చిత్రంగా ‘మండాడి’ నిలుస్తుందని, విడుదల తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు క్యూ కడతారని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఓవర్సీస్‌లో ‘ది ప్యారడైజ్‌’ మాస్‌ జాతర.. సునామి రాబోతోందా

Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!

Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు

Updated Date - Sep 09 , 2026 | 06:14 PM