సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Srinath Maganti: ఆర్టిస్టుని రీప్లేస్ చేశామని ఎవరికీ అనిపించదు.. 

ABN, Publish Date - Nov 05 , 2026 | 04:46 PM

'హిట్' సిరీస్, 'లక్కీ భాస్కర్', 'యానిమల్' సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నారు శ్రీనాథ్ మాగంటి. ఇప్పుడు  తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాలో భాగమయ్యారు.

'హిట్' సిరీస్, 'లక్కీ భాస్కర్', 'యానిమల్' సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నారు శ్రీనాథ్ మాగంటి. ఇప్పుడు  తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాలో భాగమయ్యారు. దీనికి ముందు వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో నలుగురు యువకుల పాత్రలు  ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంతో మళ్ళీ ఈ  నలుగురు కుర్రాళ్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ENE2 చిత్రాన్ని నవంబర్ 19న    ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ తరుణంలో ట్రైలర్ ను  విడుదల చేశారు. ఇందులో  గమనిస్తే మళ్లీ నలుగురు యువకుల పాత్రలు  హైలెట్ కానున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ సారి చిన్న మార్పు చోటు చేసుకుంది. 'ఈ నగరానికి ఏమైంది'లో కనిపించిన సుశాంత్ ఈ  సీక్వెల్‌లో లేరు. కొత్తగా శ్రీనాథ్ మాగంటి వచ్చారు. కార్తీక్ పాత్రలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. నటుడిగా శ్రీనాథ్ మాగంటికి ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు.

ఇంతకు ముందు ఆ పాత్రలో బలమైన ముద్ర వేసిన ఓ నటుడు పాత్రను భర్తీ చేయడం ఎవరికి అయినా సవాలే. ముఖ్యంగా 'ఈ నగరానికి ఏమైంది' వంటి కల్ట్ సినిమాలో రోల్ చేయడం ఇంకాస్త సవాల్. ట్రైలర్ లో ఆయన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీనాథ్ పోషించిన కార్తీక్ పాత్ర గురించి చర్చ నడుస్తోంది. ఈ రోల్ రీప్లేస్‌మెంట్ గురించి తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే.. 'ఆ పాత్రలో నటుణ్ని మార్చిన విషయాన్ని ప్రేక్షకులు మర్చిపోతారని చెప్పారు. అయితే ఈ పాత్రను ఆడియెన్స్ ఎంత వరకు ఓన్ చేసుకుంటారో చూడాలి. ఇందులో శ్రీనాథ్ నటన గత చిత్రాల కంటే ఇప్పుడు బాగా రిజిస్టర్ అయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  

ALSO READ
చిరంజీవి అమెరికా టూర్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్‌పై థమన్ అదిరిపోయే అప్‌డేట్!

Meenakshi Chaudhary: మీనాక్షికి మరో ఆఫర్... ఎవరితో అంటే..

DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?

Updated Date - Nov 05 , 2026 | 04:47 PM