మీరంతా నా చెల్లెళ్ళే అంటున్న నటుడు సంజోష్
ABN, Publish Date - Aug 28 , 2026 | 11:11 AM
'సోదరా' ఫేమ్ సంజోష్ రాఖీ పండగ సందర్భంగా తన ఉదారతను చాటుకున్నారు. శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి రాఖీ ఉత్సవాన్ని జరుపుకుని, ఆ సంస్థకు తన వంతు సహాయం చేశారు.
హీరో సంజోష్ శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్‌ను బహూకరించి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. 'ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే. మీకు ఏ అవసరం వచ్చినా నా వంతు అండగా ఉంటాను' అంటూ వారికి భరోసా కల్పించారు. ఇప్పటికే శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ లోని అమ్మాయిల కోసం రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్రిజ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా సంజోష్ పాల్గొన్నారు. ఇది మాత్రమే కాదు… ఇప్పటివరకు 250 మందికి మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించారు. అలాగే ముగ్గురు విద్యార్థుల చదువు బాధ్యతను ఆయన స్వీకరించారు.
వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి చిత్రసీమలో నటుడిగా రాణిస్తున్న సంజోష్, 'తన వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ఈ సేవాకార్యక్రమాలు చేస్తున్నాన'ని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
Varun Tej: 'బరి’ పై వరుణ్ తేజ్ ఫోకస్.. ఈసారి గెలుపే టార్గెట్!