సితారతో రామ్ చరణ్!
ABN , Publish Date - May 04 , 2026 | 06:36 PM
ఎన్ని పెద్ద సినిమాలు చేసినా... ఒక్కటి తక్కువైంది అంటోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆల్మోస్ట్ అందరు హీరోలతో సినిమాలు చేసినా.. ఇంకొకరు బ్యాలెన్స్ ఉన్నారంటోంది. అందుకే ఇప్పుడు ఆ కలను కూడా నెరవేర్చుకునేందుకు రెడీ అవుతోంది.
ఫైనల్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'పెద్ది' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. జూన్ 4న విడుదల తేదీ అని కన్ఫామ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే 'పెద్ది' పనులు దాదాపుగా కంప్లీట్ కావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇక నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
రామ్ చరణ్ 'పెద్ది' తర్వాత చేయబోతున్న 17వ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ కూడా చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. పైగా గతంలో ఈ ఇద్దరి కాంబోలో 'రంగస్థలం' సినిమా వచ్చింది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. సుకుమార్ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా ఉంటుందనే టాక్ నడిచింది. కట్ చేస్తే అంతలోనే టాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీతో మూవీ రామ్ చరణ్ 18వ చిత్రం ఉంటుందని వార్తలు వినిపించడం ఆసక్తికరంగా మారింది. సుక్కూ తర్వాత చరణ్ తన తదుపరి సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడట. ఇప్పటికే నాగవంశీ చరణ్ డేట్స్ ను తీసుకున్నట్లు వినికిడి. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే సినిమా స్కేల్ బాగా పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!
Read Also: మొన్న ఎమ్జీఆర్, ఎన్టీఆర్... నేడు విజయ్!
Read Also: Summer 2027: వచ్చే ఏడాది.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే