మామ అయ్యిపోయాడు.. ఇప్పుడు అల్లుడా నాగవంశీ
ABN , Publish Date - Nov 04 , 2026 | 09:42 PM
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ (Dhanush), మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓమ్ (OM): చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’.
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ (Dhanush), మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓమ్ (OM): చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’. అమరన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత రాజ్‌కుమార్ పెరియసామి కథను అందిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన శ్రీలీల నటించగా.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత నాగవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా తీసుకుంటే.. ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెల్సిందే. గతంలో లోకా: చాప్టర్ 1 తో మంచి విజయాన్ని అందుకున్న నాగవంశీ ఈ ఏడాది జైలర్ 2 తో రికార్డులను బద్దలుకొట్టాడు. జైలర్ 2 కోసం ఆయన ఆదర్శ కుటుంబం ని కూడా పక్కన పెట్టినట్లు టాక్ నడిచింది. తెలుగులో నిర్మాతగా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినా.. హిట్ సినిమాలను పంపిణీ చేసి మంచి విజయాలనే అందుకుంటున్నాడు. మొన్న జైలర్ 2 తో హిట్ అందుకున్న నాగవంశీ ఇప్పుడు ఓమ్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నాడు.
ఇప్పటికే ధనుష్ - మమ్ముట్టి కాంబినేషన్‌కు తోడు సాయి పల్లవి, శ్రీలీల కాంబో చేరడంతో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్ హైప్ నెలకొంది. దానికితోడు సక్సెస్ఫుల్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ పంపిణీ బాధ్యతలు చేపడుతుండటంతో సినిమాపై హైప్ మరింత ఎక్కువ అయ్యింది. ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టని టీమ్.. ఇకనుంచి నాగవంశీ చొరవతో తెలుగులో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కూడా చేయనుంది. మరి మామ రజనీకాంత్ తో హిట్ కొట్టిన నాగవంశీ ఇప్పుడు అల్లుడు ధనుష్ తో ఎలాంటి హిట్ అందుకొంటాడో చూడాలంటే నవంబర్ 20 న ఓమ్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
Also Read:
Medha Meka: మరో శ్రీలీలలా మారకమ్మా..
Allu Arjun: రామాయణ.. మన సంస్కృతికి ప్రతిబింబం
అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్