Medha Meka: మరో శ్రీలీలలా మారకమ్మా..
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:47 PM
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంత తెలివిగా మలుచుకుంటే అంతా ఎక్కువ కాలం ఉండవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే వారు ఆచితూచి అడుగులు వేయాలి.
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంత తెలివిగా మలుచుకుంటే అంతా ఎక్కువ కాలం ఉండవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే వారు ఆచితూచి అడుగులు వేయాలి. అలా ఆచితూచి అడుగులు వేయకపోతే.. మొదటి సినిమాతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నవారే.. ఆ తరువాత ఐరన్ లెగ్ అని అనిపించుకోవాల్సి వస్తుంది. మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చే ఏ హీరోయిన్ అయినా కొంచెం ఫేమస్ అయితే చాలు.. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే వరుస ఛాన్స్ లు క్యూ కడతాయి. ఛాన్స్ లు వచ్చాయి కదా అని వెంటవెంటనే ఓకే చేసేసి టాలీవుడ్ లో కొందరు కుర్ర హీరోయిన్లు చేతులు కాల్చుకున్నారు. ఆ లిస్ట్ లో చేరకుండా ఆచితూచి అడుగులు వేయమని ఒక అప్ కమింగ్ హీరోయిన్ కి ఇండస్ట్రీ వర్గాలు సూచనలు ఇస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహల ముద్దుల కూతురు మేధా మేక (Medha Meka) అధికారికంగా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామిడీ చిత్రం మైత్రీ ఇన్ లవ్ ద్వారా మేధా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ స్టార్ కిడ్, నేషనల్ లెవెల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఈ చిన్నది కుర్రకారు క్రష్ లిస్ట్ లో చెరిపోయింది. అంతేకాకుండా ఇంకా తన సినిమా రిలీజ్ కూడా కాకముందే టాలీవుడ్లో వరుస ఆఫర్లు క్యూ కడుతుండటంతో, తదుపరి స్టార్ హీరోయిన్ గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్‌లోని ఒక పాపులర్ సీక్వెల్ ప్రాజెక్ట్ కోసం కూడా మేధా మేకను ఎంపిక చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వారంలో రానున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ఆఫర్ కనుక ఓకే అయితే, మేధాకు ఇది కెరీర్ ప్రారంభంలోనే బిగ్ బ్రేక్ కానుందని టాక్. అయితే ఇక్కడవరకు బాగానే ఉన్నా.. మేధా తన కెరీర్ ని స్పీడుగా కాకుండా ఆచితూచి అడుగులు వేయాలని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. వరుస సినిమాలని అంగీకరించకుండా.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే అందాల భామ శ్రీలీల కూడా మొదటి సినిమాతోనే స్టార్ గా మారి.. వరుస సినిమాలని అంగీకరించి.. ప్లాపులను మూట కట్టుకుంది. ఇప్పుడు తెలుగుని వదిలేసి తమిళ్ లో సినిమాలు చేస్తుంది. అలా మేధా మారవద్దని చెప్పుకొస్తున్నారు. అయినా మేధా తండ్రి శ్రీకాంత్.. కూతురి విషయంలో ఆచితూచి అడుగులే వేస్తాడని, ఆయన ఉండగా మేధా కెరీర్ కి ఢోకా లేదని అంటున్నారు. మరి మేధా మేక భవిష్యత్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆమె మొదటి సినిమా రిలీజ్ అవ్వాల్సిందే.
ఇవి కూడా చదవండి:
లేడీ పవర్‌తో నవంబర్ హీటెక్కనుందా
ఎన్టీఆర్ వదిలిన ఇట్లు అర్జున ట్రైలర్.. అదిరింది
మాయ లేడీ ట్రైలర్.. ట్విన్ సిస్టర్స్ తో హీరో రొమాన్స్