సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్ లో విషాదం... తనువు చాలించిన నిర్మాత!

ABN, Publish Date - Mar 13 , 2026 | 04:16 PM

సీనియర్ ప్రొడ్యూసర్ ఎం. అర్జునరాజు కన్నుమూశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, శ్రీకాంత్ తదితరులతో అర్జునరాజు సినిమాలు నిర్మించారు.

M Arjuna Raju

సీనియర్ ప్రొడ్యూసర్ ఎం. అర్జునరాజు (80) శుక్రవారం మధ్యాహ్నంలో అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. తన మిత్రులతో కలిసి ఆయన ఎన్టీఆర్ హీరోగా 'వేటగాడు, కొండవీటి సింహం' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కృష్ణ, కృష్ణంరాజు 'అడవి సింహాలు', శోభన్‌ బాబు 'కోడెత్రాచు' చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.


చిరంజీవితో 'జేబుదొంగ', అక్కినేని నాగార్జునతో 'బావ నచ్చాడు' చిత్రాలను నిర్మించారు. ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్‌, కృష్ణంరాజు ప్రధాన పాత్రధారులుగా 'మా నాన్నకు పెళ్ళి' సినిమాను ఎం. అర్జునరాజు నిర్మించారు. అలానే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'జాబిలి' చిత్రాన్ని మీడియం బడ్జెట్‌లో నిర్మించారు. అర్జునరాజు చివరగా జగపతిబాబుతో 'జగపతి' చిత్రాన్ని నిర్మించారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అర్జునరాజు 'నిషానా, జానీ దోస్త్‌, ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌' వంటి చిత్రాలు నిర్మించారు. ఎం. అర్జున రాజు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. అర్జునరాజు అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 05:07 PM