క్రిస్మస్ బాక్సాఫీస్ బరిలో హాలీవుడ్ వర్సెస్ ఇండియన్ స్టార్స్
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:55 PM
క్రేజీ హాలీవుడ్ మూవీస్ వస్తున్నాయంటే టాప్ స్టార్స్ సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు... అయితే ముగ్గురు సీనియర్ స్టార్స్ మాత్రం 'ఎవరితోనైనా ఢీ' కొట్టడానికి రెడీ అంటున్నారు... ఎవరా ముగ్గురు స్టార్ హీరోస్.
సంక్రాంతి బరిలో టాప్ స్టార్స్ మూవీస్ ఢీ కొనడం చూస్తూనే ఉంటాం... ఆ సమయంలో పరభాషా చిత్రాల అనువాదాలు కూడా బరిలోకి దూకినా తెలుగు సినిమాల సందడే ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ సారి క్రిస్మస్ కు కూడా ఆ తరహా హంగామా కనిపించనుంది. ప్రతి క్రిస్మస్ కు హాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ వెలుగు చూస్తూనే ఉంటాయి... అయితే బిగ్ బడ్జెట్ మూవీస్ కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సారి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రెండు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. 'జుమాన్జీ' సిరీస్ లో 'ఓపెన్ వరల్డ్' డిసెంబర్ 25న రానుంది. అదే రోజున లూకా గాడగ్నినో దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్టిఫిసియల్' కూడా వెలుగు చూడనుంది. ఈ సినిమాలకంటే ఓ రోజు ముందుగా బాలకృష్ణ 'దాదా', నాగార్జున 'కింగ్ 100', షారుఖ్ ఖాన్ 'కింగ్' చిత్రాలు విడుదల కానున్నాయి. అలా హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ తోనే తలపడుతున్న మన సీనియర్ స్టార్స్ గురించి అటు ముంబైలో, ఇటు హైదరాబాద్ లోనూ విశేషంగా చర్చించుకుంటున్నారు.
క్రిస్మస్ కు ఓ వారం ముందు అంటే డిసెంబర్ 18వ తేదీన మరో రెండు హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో 'అవెంజర్స్: డూమ్స్ డే' ఒకటి కాగా, మరోటి 'డ్యూన్ - పార్ట్ త్రీ'. ఈ రెండు చిత్రాల ప్రీక్వెల్స్ ఇప్పటికే జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు మన దేశంలోనూ భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాల కోసం మన దేశంలో నార్త్, సౌత్ అన్న తేడాలేకుండా అన్ని చోట్లా క్రేజీ థియేటర్స్ నే బ్లాక్ చేశారు. ఈ సినిమాలు వచ్చిన ఆరు రోజులకే బాలయ్య 'దాదా', నాగ్ 'కింగ్ 100', షారుఖ్ 'కింగ్' వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ టాక్ సంపాదించినా, మన ఇండియన్ మూవీస్ ను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించరని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ మన సీనియర్ స్టార్స్ మూడు చిత్రాలు గుడ్ టాక్ సంపాదిస్తే తరువాతి రోజు వచ్చే హాలీవుడ్ మూవీస్ కు దెబ్బ పడుతుందనీ అంటున్నారు. ఇలా మొత్తానికి హాలీవుడ్ సినిమాలకు మన సీనియర్ స్టార్స్ చిత్రాలు గుబులు పుట్టిస్తున్నాయి.
బాలకృష్ణ, నాగార్జున, షారుఖ్ ఖాన్ ముగ్గురూ ఒకప్పుడు క్రిస్మస్ కు బంపర్ హిట్స్ చూసినవారే. అందువల్ల అదే కాన్ఫిడెన్స్ తో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఈ స్టార్స్. ఈ ముగ్గురి చిత్రాలు మన దేశంలోనే కాదు అమెరికాలోనూ రిలీజ్ అవుతున్నాయి. పలు హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండగా, అక్కడ మన ఇండియన్ మూవీస్ కు సరైన థియేటర్స్ లభిస్తాయా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా హాలీవుడ్ బిగ్ మూవీస్ తోనే పోటీకి సై అంటున్న ఈ మూడు చిత్రాలు యు.ఎస్.లోనూ చర్చకు తెరలేపడం గమనార్హం. మరి మన ముగ్గురు సీనియర్ స్టార్స్ లో ఎవరి సినిమా ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్
‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే
నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్