సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శేఖర్‌ మాస్టర్‌కు యాక్సిడెంట్‌.. మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చారు..

ABN, Publish Date - Nov 12 , 2026 | 12:42 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ (Sekhar master) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్  చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కాకా’ (kaaka) సినిమా షూటింగ్‌ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నవంబర్‌ 12న ఉదయం 6 గంటల సమయంలో ముచ్చింతల్‌ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన వ్యాన్‌ ఢీకొనడంతో శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు దెబ్బతింది.

అయితే, ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడినట్లు  శేఖర్‌ మాస్టర్‌ టీమ్‌ వెల్లడించింది. సినిమా పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనతో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, శేఖర్‌ మాస్టర్‌ క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు

Updated Date - Nov 12 , 2026 | 01:09 PM