‘సమవర్తి’గా సత్యదేవ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
ABN, Publish Date - May 22 , 2026 | 07:07 PM
టాలీవుడ్‌లో టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరోలలో సత్యదేవ్ ఒకరు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇప్పుడు తన రూటు మార్చి యాక్షన్ వైపు అడుగు పెడుతున్నారు.
టాలీవుడ్‌లో టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ నటిస్తోన్న నూతన చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్‌ని ఖరారు చేస్తూ.. శుక్రవారం (మే 22) ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సత్యదేవ్ నటిస్తోన్న 16వ చిత్రమిది. ఈ చిత్రానికి ‘సమవర్తి’ (Samavarthi) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, విడుదల చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘సమవర్తి’ సినిమాను రుద్ర పిక్చర్స్ అండ్ పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ (Samavarthi First Look)ని గమనిస్తే..
ఈ పోస్టర్‌లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకు వస్తుండగా.., ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్‌లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ప్రకృతి, అడవి వాతావరణాన్ని బలంగా ప్రతిబింబించిన ప్రీ-లుక్ పోస్టర్.. ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, సత్యదేవ్ వెనుక కనిపించే పులి, కుందేలు ద్వారా ప్రకృతికి సంబంధించిన అంశాన్ని ఇందులో చేర్చి మరింత ఆసక్తిని పెంచారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అవుతుందనే అంచనాలు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. మొత్తంగా అయితే.. సత్యదేవ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చినట్లుగా ఈ పోస్టర్ తెలియజేస్తోంది. చూద్దాం మరి.. ఈ జానర్‌లో ఆయన ఎలాంటి సక్సెస్‌ని అందుకుంటారో?
ఇవి కూడా చదవండి:
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?
Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!