సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:22 PM
వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు.
బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న'. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట 'సర్వాయి పాపన్న' సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి గురించి సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నాను' అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ, 'సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. 'బాహుబలి'లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, బి.సి. సాధికార సంఘం అధ్యక్షులు కొండ దేవన్న, గాయకుడు ఏపూరి సోమన్న, హీరోయిన్ పాయల్ ముఖర్జీ, రచయిత, పాత్రికేయుడు పొన్నం రవిచంద్ర, దిల్ సుఖ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గౌడ్, సర్దార్ పాపన్న వారసుడు రాజన్న, గౌడ సంఘాల నాయకులు గట్టు రామచంద్రరావు, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, డైరెక్టర్, రైటర్ దీపక్ న్యాతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
కన్నీళ్లను జయించిన రాజకుమారి.. ‘అగ్నిపరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్ వరకు!
వంటగదికే వెళ్లని సమంత మాస్టర్‌చెఫ్‌కి జడ్జ్ ఏంటి!?
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్..