వంటగదికే వెళ్లని సమంత మాస్టర్‌చెఫ్‌కి జడ్జ్ ఏంటి

ABN , Publish Date - Aug 17 , 2026 | 09:41 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనారోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వర్కవుట్స్, ఆధ్యాత్మిక పర్యటనలతో మైండ్ ఫుల్‌నెస్‌పై దృష్టి సారించడమే కాకుండా తనకు నచ్చిన రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసికొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం సామ్ ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. మా ఇంటి బంగారం సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ కుకింగ్ రియాలిటీ షో మాస్టర్‌చెఫ్ తమిళం (MasterChef Tamil) కు హోస్ట్‌గా మారింది.


ఈమధ్యనే మాస్టర్‌చెఫ్ తమిళ్ కుకింగ్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో చూశాక సమంత హోస్ట్‌గా రావడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. తన జీవితంలో ఎప్పుడూ వంటగదిలోకి వెళ్లలేదని, తనకు అస్సలు వంట రాదని సమంత స్వయంగా గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి ఉన్న రోజుల్లో చైతూ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సామ్ అస్సలు కిచెన్‌లోకి వెళ్లదు, ఇంట్లో అప్పుడప్పుడు నేను వంట చేస్తాను' అని సరదాగా వ్యాఖ్యానించిన వీడియోలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. కనీసం వంట గురించి ప్రాథమిక అవగాహన కూడా లేని సమంత, ఒక అంతర్జాతీయ స్థాయి కుకింగ్ షోకి హోస్ట్‌గా ఎలా వ్యవహరిస్తుందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


కుకింగ్ షో అంటే చెఫ్స్ యే అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం పప్పుల పేర్లు అయినా తెలిసి ఉండాలి. అవైనా సమంతకు తెలుసా.. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో తన భర్తకు వంట చేసిన వీడియోలో కూడా ఇదేంటి.. అదేంటి అంటూ సామ్ .. సుమని, నందినిరెడ్డిని అడిగింది. ఇక ఇప్పుడు ఇంతపెద్ద కుకింగ్ షోలో అలా అడిగితే పరువు పోతుందని కొందరు చెప్పుకొస్తున్నారు.


మరొకవైపు సమంత అభిమానులు మాత్రం ఈ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మాస్టర్‌చెఫ్ షోకి హోస్టింగ్‌ చేయడం అంటే స్వయంగా వంటలు చేయడం కాదని, కేవలం షోని నడిపించడం, పోటీదారులను ప్రోత్సహించడం, ఎంటర్‌టైన్ చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. సమంతకు ఉన్న పాపులారిటీ, ఛార్మింగ్ ప్రెజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ దృష్ట్యా ఆ షోకి హోస్ట్‌గా చేసే పూర్తి అర్హతలు ఆమెకు ఉన్నాయని, కేవలం నెగెటివిటీని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నవారే ఇలాంటివి మాట్లాడతారని వాదిస్తున్నారు. మరి ఈ షోతో సామ్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 17 , 2026 | 09:58 PM