అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్..

ABN , Publish Date - Aug 17 , 2026 | 08:57 PM

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

Anirudh Ravichander

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలు, వరస చార్ట్‌బస్టర్ హిట్ల విషయం పక్కన పెడితే.. ఈ బక్కోడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ (Kavya Maran) తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పమన్న విషయం తెల్సిందే. ఇటీవల అనిరుధ్ మేనమామ, సీనియర్ నటుడు మహేంద్రన్ వీరి సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదే అంటూ పోస్టులు వైరల్ గా మారాయి. నవంబర్ 10వ తేదీన గ్రీస్‌లో అత్యంత వైభవంగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకూ అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా వీరిద్దరి గురించి ఇటువంటి రూమర్లు వచ్చినా, ఇరు వర్గాలు స్పందించకపోవడంతో ఫ్యాన్స్ ఈ వార్తలలో ఎంత నిజముందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాలతో పాటు క్రికెట్ అభిమానుల్లోనూ ఈ వార్త తీవ్రంగా వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల్లో సందడి చేసే కావ్య మారన్, వరుస చార్ట్‌బస్టర్ హిట్లతో రచ్చ చేసే అనిరుధ్ జంటగా మారబోతున్నారనే వార్త నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై వీరిద్దరి నుంచి ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం అనిరుధ్ తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Updated Date - Aug 17 , 2026 | 09:00 PM