బాలయ్యకి అన్నయ్యగా ఆ బాలీవుడ్ స్టార్.. నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!
ABN, Publish Date - Jul 13 , 2026 | 08:49 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది బ్లాక్ బస్టర్స్ కొట్టే కొరటాల శివ కలయికలో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనున్న సంగతి విదితమే.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది బ్లాక్ బస్టర్స్ కొట్టే కొరటాల శివ (Koratala Siva) కలయికలో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనున్న సంగతి విదితమే. NBK112 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుండగా, ‘దేవర’ (Devara) వంటి భారీ చిత్రం తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ సినిమా అంటేనే ఒక బలమైన నేపథ్యం, ఆసక్తికరమైన కథనం కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నటసింహం కోసం కూడా అలాంటి ఓ విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారని, స్క్రిప్ట్ పరంగా ఆయన సుదీర్ఘమైన కసరత్తులు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తారని గతంలో ప్రచారం జరగ్గా, ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అని తెలుస్తోంది. ఇందులో బాలయ్యకు అన్నయ్యగా సంజయ్ దత్ కనిపించనున్నారని, వీరిద్దరి ట్రాక్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ అన్నదమ్ముల బంధం, సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చెబుతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు యాక్షన్ దిగ్గజాలు స్క్రీన్ షేర్ చేసుకుంటే థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కాస్టింగ్ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సంజయ్ దత్ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారనే ఊహాగానాలకు మరింత రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఇద్దరు స్టార్స్ కాంబినేషన్ వార్తలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్, కొరటాల మార్క్ క్లాస్ టేకింగ్ కలగలిపి ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా మలచనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బలమైన ఎమోషన్స్, మాస్ యాక్షన్ సీక్వెన్సులు, కట్టిపడేసే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా, బాలకృష్ణ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా దర్శకుడు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మాస్ జాతరను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బాలయ్య-కొరటాల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది
‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!
‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత