పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:42 PM
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కింగ్ నాగార్జున (King Nagarjuna) మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఇద్దరూ కలిసినప్పుడు వారు కనిపించే ఫ్యామిలీ బాండింగ్.. వారి అభిమానులకు కూడా ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇక ఇప్పుడు అఖిల్ (Akhil Akkineni) నటించిన ‘లెనిన్’ చిత్రం (Lenin Movie) పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతున్న నేపథ్యంలో చిరంజీవి తన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు కింగ్ ఫ్యామిలీ స్పందించిన తీరుతో.. సోషల్ మీడియా అంతా ఇప్పుడిదే టాక్ నడుస్తోంది.
‘‘పెదనాన్న.. నాపై ఎప్పుడూ మీ ప్రేమ ఇలానే ఉంటుందని తెలుసు. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. దయచేసి సినిమా చూడండి. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’’ అని చిరంజీవి ట్వీట్‌కు అఖిల్ అక్కినేని రిప్లై ఇచ్చారు. అలాగే కింగ్ నాగార్జున కూడా చిరంజీవి ట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు. ‘‘ధన్యవాదాలు చిరంజీవి గారు.. మీరు ఎల్లప్పుడూ నాకు, నా కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. దయచేసి సినిమా చూడండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను ప్రామిస్ చేస్తున్నాను’’ అని నాగార్జున తన రిప్లై పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు పోస్ట్‌లలో అఖిల్ చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియా తగలడిపోతోందంటే నమ్మాలి.
‘పెదనాన్న’ అంటూ ఆప్యాయంగా అఖిల్ పిలిచిన తీరు.. మెగా, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న బాండింగ్‌ని తెలియజేస్తుందని.. ఈ ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యాన్స్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అంతకు ముందు చిరంజీవి కూడా అఖిల్ తనకు కుమారుడిలాంటి వాడని తెలపడం.. అక్కినేని అభిమానులను మరింత ఖుషి చేస్తోంది. చిరంజీవి తన ట్వీట్‌లో..
‘‘లెనిన్ సినిమాకు వస్తున్న స్పందన గురించి విన్నాను. అఖిల్ నటనకు గురించి ప్రేక్షకులు, అభిమానులు అద్భుతంగా చెబుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అఖిల్ నాకు మరో కొడుకులాంటి వాడు. ప్రతి సినిమాతో నటుడిగా అతను మరింత పరిణతి సాధిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. నా మిత్రుడు నాగార్జునతో పాటు దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ అభినందనలు. ఈ చిత్రం మరింత విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!
‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత
‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!