సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘సందిగ్ధం’ అవసరం లేదు.. పక్కాగా హిట్ అవుతుందట!

ABN, Publish Date - May 23 , 2026 | 09:20 PM

తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Sandigdham Trailer Launch

తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సందిగ్ధం’ (Sandigdham). నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి హీరోహీరోయిన్లుగా.. ‘తెరచాప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్‌గా నటించిన ఈ సినిమా మే 29న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ (Sandigdham Trailer Launch)ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ.. ‘సందిగ్ధం’ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. మంచి లవ్ స్టోరీ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ మూవీ ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఇందులో నటించిన ప్రతీ ఆర్టిస్ట్, టెక్నీషియన్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. వారందరి సపోర్ట్‌తోనే, సినిమాని ఇంత బాగా తీయగలిగాం. ‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాం. మే 29న మా సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నానని అన్నారు.


సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ మాట్లాడుతూ.. ‘సందిగ్ధం’ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు పార్థసారధి మూవీని చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిహాల్, కాజల్ తివారి, అర్జున్, ఆనంద్, నవీన్ రాజ్, చిట్టి బాబు వంటి నటీనటులందరూ మాట్లాడుతూ.. ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 23 , 2026 | 09:20 PM