బిడ్డ పుట్టిన నెల రోజులకే సమంత రీఎంట్రీ..

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:16 PM

స్టార్ హీరోయిన్ సమంత మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న వేళ ఆమె సినీ రీఎంట్రీపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అభిమన్యుడు 2 సినిమాతో సమంత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో పోషించిన పాత్రనే సీక్వెల్‌లోనూ కొనసాగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా గురించి సమంత నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

samantha

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తోన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె..మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. అతడికి దేవ్ నిడిమోరు అనే పేరు పెట్టినట్లు కూడా సామ్ అధికారికంగా ప్రకటించింది. సామ్ ఎప్పటి నుంచో తల్లి కావాలని కలలు కన్నానని, ఇన్నాళ్ళకు అది నిజం అవుతుందని, తన బిడ్డ కోసం ఎంతవరకు వెళ్లాలన్నా వెళ్తానని, తన సర్వసం తన బిడ్డనే అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇక తన బిడ్డ ఎదిగి, తనంతట తాను నడిచేవరకు కూడా సామ్ సినిమాల వైపు చూడదు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే, బిడ్డ పుట్టి ఇంకా నెల కూడా కాకముందే సమంత రీఎంట్రీ గురించిన వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.


అందుతున్న సమాచారం ప్రకారం సమంత రీఎంట్రీ ఒక సినిమా సీక్వెల్ తో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఆ సీక్వెల్ మరేదో కాదు అభిమన్యుడు-2 (Abhimanyudu 2). సామ్ కెరీర్ లో అభిమన్యుడు సినిమా టాప్ 10 లో ఉంటుంది. విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు చిత్రం విశాల్ కెరీర్‌లోనే మంచి హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు దర్శకుడు పీఎస్ మిత్రన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఓకే అంటే హీరో విశాల్ కూడా సిద్ధంగా ఉండగా, తాజా సమాచారం ప్రకారం పీఎస్ మిత్రన్ ఇప్పటికే సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఆమె చేసిన సైకియాట్రిస్ట్ పాత్రను సీక్వెల్‌లోనూ సమంతే పోషించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడే సినిమా చేస్తామని పీఎస్ మిత్రన్ చెప్పినట్లు సమాచారం.


ఇక దీంతో కచ్చితంగా సమంత రీఎంట్రీ మూవీ అభిమన్యుడు-2 అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సామ్.. ఈ సినిమా ఒప్పుకొనేసరికి ఎంత సమయం పడుతుంది.. ? సామ్ రీఎంట్రీ కోసం రాజ్ నిడిమోరు ఏం ప్లాన్ చేస్తున్నాడు..? అనేది మిస్టరీగా మారింది. రాజ్ నిడిమోరు కనుక సమంతతో కలిసి మరో సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ ప్లాన్ చేస్తే, సమంత తొలి ప్రాధాన్యత అటువైపే ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తన బాబు ఎదిగేవరకు సామ్.. ఆగుతుందా.. ? మధ్యలోనే రీఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Varshini- Mukesh: ఛీఛీ.. ముద్దులు, హగ్గులు ఇచ్చి అన్నాచెల్లెళ్లు అంటుందేంటి

స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య కీర్తన.. ఇది కదా తెలుగోడి పవర్ అంటే

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 175వ చిత్రం షురూ

Updated Date - Nov 28 , 2026 | 07:21 PM