Samantha - Raj Nidimoru: సమంత రాజ్ నిడిమోరు ఆసరా కోరుకుంటోందా!?

ABN , Publish Date - May 15 , 2025 | 02:41 PM

  ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌  నిడిమోరు (Raj Nidimoru), నటి సమంతలపై (``Samantha) కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

 
‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌  నిడిమోరు (Raj Nidimoru), నటి సమంతలపై (``Samantha) కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలు కార్యక్రమాల్లో  కలిసి కనిపించడం వల్ల వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, డేటింగ్‌ చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా సమంత చేసిన పోస్ట్‌తో ఈ వార్త మరింత వైరల్‌ అయి మరింత బలం చేకూరింది. రాజ్‌ - సమంతలపై వచ్చిన గాసిప్‌లను నిజం చేసేలా ఉందే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే.. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం 'శుభం’ సక్సెస్‌లో భాగంగా చిత్రబందం రాజ్‌ నిడుమోరుతో కలిసి దిగిన ఫొటోలను బుధవారం సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘శుభం’తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని రాసుకొచ్చారు. ఈ ఫొటో వైరల్‌గా మారిన తరుణంలో రాజ్‌ సతీమణి శ్యామాలి తాజాగా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. 

‘‘నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసిన వారందరికీ ప్రేమ, ఆశీస్సులు అందిస్తున్నా’’ అని పోస్ట్‌ను ఆమె షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కొంతకాలంగా ఇన్‌స్టాలో ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేయని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు షేర్‌ చేశారా? అని చర్చ జరుగుతోంది. సైకాలజీ చదువుకున్న శ్యామలి బాలీవుడ్‌ దర్శకులు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా, విశాల్‌ భరద్వాజ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకురాలిగా పనిచేశారు. ‘రంగ్‌దే బసంతి’, ‘ఓంకార’ చిత్రాలకు క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా వర్క్‌ చేశారు. 2015లో రాజ్‌ నిడిమోరుతో ఆమె పెళ్లి జరిగింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్‌ సిరీస్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే!
 

Updated Date - May 15 , 2025 | 02:47 PM