సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..

ABN, Publish Date - Nov 05 , 2026 | 08:57 PM

మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. ఆయనను చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు? అని అంతా సెర్చ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Sai Durgha Tej and Kiran Engagement

మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. ఆయనను చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు? ఆమె నేపథ్యమేంటి? అనే అంశంపై అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు కాబోయే వధువుకు సంబంధించిన వివరాలను ఇరు కుటుంబాలు అత్యంత గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు ‘కిరణ్’ (Kiran). అయితే ఆమె సినీ రంగానికి చెందినవారా? లేక వ్యాపార, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయా? అనే పూర్తి వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఆమె పేరు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ‘కిరణ్’ ఎవరు అనే దానిపై నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.


ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చిన ఈ సంబంధానికి సంబంధించి నేడు (గురువారం) ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక (Sai Durgha Tej and Kiran Engagement) గ్రాండ్‌గా జరిగింది. ఎంతో ప్రైవేట్‌గా నిర్వహించిన ఈ వేడుక తర్వాతే కాబోయే వధువు కిరణ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అటు డిసెంబర్ 10న వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు ఇప్పటికే ప్రచారం సాగుతుండగా, సాయి దుర్గా తేజ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో మెగా అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్, కిరణ్‌ల ఎంగేజ్‌మెంట్ పిక్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

చిరంజీవి ‘మెగావర్స్‌’లో సందడి చేయనున్న స్టార్స్‌ వీరేనా?

సుడిగాలి సుధీర్‌ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?

అనిరుధ్ పెళ్లికి ఆ స్టార్ హీరోని పిలవలేదా.. కోలీవుడ్‌లో సరికొత్త రచ్చ

Updated Date - Nov 05 , 2026 | 09:13 PM