డీమోన్ పవన్ హీరోగా చేస్తోన్న ‘సాV3’ టీజర్ విడుదల
ABN, Publish Date - Aug 17 , 2026 | 06:39 PM
సామ్రాట్, డీమోన్ పవన్ (బిగ్ బాస్ ఫేమ్), లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘సాV3’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
సామ్రాట్ (Samrat), డీమోన్ పవన్ (బిగ్ బాస్ ఫేమ్), లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘సాV3’ (SaaV3). లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ (Krishna Maya) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
టీజర్ విడుదల అనంతరం హీరో డీమోన్ పవన్ (Demon Pawan) మాట్లాడుతూ.. మా ‘సాV3’ సినిమా టీజర్ లాంఛ్ వేడుకకు వచ్చిన నా స్నేహితులందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కృష్ణ మాయకు థ్యాంక్స్. సినిమా పట్ల ఆయనకు మంచి విజన్ ఉంది. ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసే ఒక మంచి మూవీని ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నా కో ఆర్టిస్ట్స్ సామ్రాట్, లిఖితతో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్‌ను ఇచ్చింది. టీజర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుని, పెద్ద సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. హీరోయిన్ లిఖిత (Likhitha) మాట్లాడుతూ.. ఈ కథ చెబుతున్నప్పుడే ఎలాగైనా ఈ సినిమాలో నటించాలనేంత ఇష్టం ఏర్పడింది. మేమంతా సినిమాలో ఇంత బాగా ఇన్వాల్వ్ అయి చేశామంటే అందుకు మా డైరెక్టర్ కృష్ణమాయ కారణం. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. అందరి సపోర్ట్ మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
హీరో సామ్రాట్ మాట్లాడుతూ.. నన్ను ఇప్పటి వరకు లవర్ బాయ్‌లా, చాక్లెట బాయ్‌లా, ఫియాన్సేలా, డబ్బున్న కుర్రాడిలా చూపించారు. అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తుండేవి. ఒకే తరహా పాత్రలు చేస్తున్నాననే ఫీలింగ్ నాలో ఉండేది. అలాంటి టైమ్‌లో కృష్ణ మాయ ఈ సినిమా స్టోరీ చెప్పాడు. కథ వింటున్నప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుందనే క్యూరియాసిటీ కలిగింది. ‘సాV3’లో నన్ను త్రివిక్రమరాజు పాత్రలో కొత్తగా చూస్తారు. నేను ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా నాకు రీలాంఛ్ లాంటిది. ఇలాంటి మంచి మూవీ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ కృష్ణ మాయకు ధన్యవాదాలని అన్నారు. నిర్మాత వి. విజయ మాట్లాడుతూ.. వచ్చిన అతిథులకు, ఎంతగానో సపోర్ట్ చేసిన సుధావల్లి, నాగవర్థినిలకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్‌తో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.
డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ.. సినిమా ప్రొడక్షన్ ఎలా చేయాలనేది నేను అశోక్ కుమార్‌ను చూసి నేర్చుకున్నాను. ఆయన నాకు గురువు. సినిమా దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం వంటి మహామహుల దగ్గర వర్క్ చేసినప్పుడు తెలుసుకున్నాను. మా ఆర్టిస్టులు సామ్రాట్, పవన్, లిఖిత ముగ్గురూ అద్భుతంగా నటించారు. మూవీ క్లైమాక్స్‌లో సామ్రాట్ నటన చూసి అంతా షాకవుతారు. అలాగే లిఖిత, పవన్ ఇద్దరూ గొప్ప నటులు. వారికి ఫ్యూచర్‌లో మంచి పేరొస్తుంది. పవన్‌ను మరో సినిమాకు నేనే లాక్ చేశా. తర్వాత పవన్ అంత ఈజీగా దొరకడు. ఈ సినిమాను అన్ని విషయాల్లో సక్సెస్ ఫుల్‌గా తీసుకెళ్తున్నాం. ఇది టీజర్ మాత్రమే.. సినిమాలో ఇంకా స్ట్రాంగ్ కంటెంట్ చూస్తారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్ కుమార్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్, నటుడు సంజయ్ తుమ్మ, నటి హారిక, రీతూ చౌదరి తదితరులు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
పెద్ద మనసుతో క్షమించండి.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్
వరుణ్ తేజ్‌కు హిట్.. కనకరాజు 10 డేస్ కలెక్షన్స్ ఎంతంటే
దొంగ జూబ్లీస్... బాబోయ్ దొంగ జూబ్లీస్...