రోషన్ వర్సెస్ అనశ్వర రాజన్!
ABN, Publish Date - Sep 29 , 2026 | 12:25 PM
గత యేడాది డిసెంబర్ 25న వచ్చిన 'ఛాంపియన్' మూవీలో రోషన్ మేకా, అనశ్వర రాజన్ జంటగా నటించారు. అయితే అక్టోబర్ 30న విడుదల కాబోతున్న సినిమాలతో వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు.
మలయాళీ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ (Anaswara Rajan) అనువాద చిత్రాలతో తొలుత తెలుగువారి ముందుకొచ్చింది. ఆమె నటించిన 'రేఖాచిత్రం' ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. అలా గత యేడాది డిసెంబర్ 25న అనశ్వర రాజన్ నటించి స్ట్రయిట్ తెలుగు సినిమా 'ఛాంపియన్' విడుదలైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా (Roshan Meka) హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో పాటు అవార్డులనూ అందుకుంది. హీరో రోషన్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులలో స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యాడు.
'ఛాంపియన్' (Champion) లో తొలిసారి జంటగా నటించిన రోషన్, అనశ్వర రాజన్ ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. రోషన్ మేకా హీరోగా నటించిన 'ఏమో ఏమో ఇది' సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. అలానే అనశ్వర రాజన్ నటించిన రెండో తెలుగు సినిమా 'ఇట్లు అర్జున' (Itlu Arjuna) కూడా అక్టోబర్ నెల 30న జనం ముందుకు వస్తోంది. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మించిన ఈ సినిమాతో మహేశ్ ఉప్పల డైరెక్టర్ గానూ, అనీశ్ హీరోగానూ పరిచయం అవుతున్నారు. విశేషం ఏమంటే అనశ్వర తొలి తెలుగు చిత్రంగా 'ఛాంపియన్' విడుదలైనా, ఆమె అంగీకరించిన మొదటి తెలుగు సినిమా 'ఇట్లు అర్జున'! ఇప్పుడు ఆమె తన ఫస్ట్ ఫిల్మ్ హీరో రోషన్ మూవీ 'ఏమో ఏమో ఇది'తో పోటీ పడబోతోంది. మరి అక్టోబర్ 30న వస్తున్న ఈ రెండు సినిమాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
16 ఏళ్లకే ఇల్లు వదిలి వచ్చేసిన అక్కినేని కోడలు..
నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి అన్‌ఫిల్టర్డ్ స్టోరీస్..
Devara 2: ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్? కథలో మార్పులకు ఓకే చెప్పిన తారక్?