‘కపాలి’గా రోహిత్ నారా.. ఫస్ట్ లుక్ అదిరింది
ABN, Publish Date - Jul 24 , 2026 | 07:50 PM
హీరో రోహిత్ నారా ఈ మధ్య వరుస సినిమాలతో బిజీ నటుడిగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
హీరో రోహిత్ నారా (Rohith Nara) ఈ మధ్య వరుస సినిమాలతో బిజీ నటుడిగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. రామ్ గన్ని (Raam Ganni) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మిస్తుండగా.. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. రోహిత్ నారా పుట్టినరోజు (జూలై 25) సందర్భంగా, చిత్ర నిర్మాతలు శుక్రవారం ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘కపాలి’ (Kapaali) అనే పవర్ టైటిల్ ఖరారు చేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది. (HBD Rohith Nara)
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోహిత్ నారా ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కనిపిస్తున్నారు. కంటికి కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్లు పోస్టర్‌లో చూపించారు. గడ్డం, భయానకమైన చూపులు ఆయన పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి. ఆయన తలపై కిరీటంలా కనిపించే వంకర చెట్టు కొమ్మలు మిస్టికల్ కనెక్షన్‌ను సూచిస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ప్రాచీన చిహ్నాలతో కూడిన డిజైన్ సినిమా మిస్టరీ, క్షుద్రశక్తులు, పురాణ నేపథ్యానికి దారితీస్తోంది. ‘A Journey Into The Unknown’ అనే ట్యాగ్‌లైన్ పోస్టర్‌లోని మిస్టరీని మరింత ఎలివేట్ చేస్తోంది.
ఇంకా పోస్టర్ ముందు భాగంలో ఎర్రటి కళ్లతో కనిపించే భయానక మహిళా రూపం అతీంద్రియ శక్తిని సూచిస్తే.. ఆమె పక్కనే తుపాకీ పట్టుకున్న పోలీసులతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు కనిపిస్తున్నారు. ఒక పోలీస్ వాహనం ప్రకాశవంతమైన యాగ వలయంపై నిలిచినట్లు చూపించిన తీరు చూస్తే.. పోలీస్ వ్యవస్థ ఓ భయానక పారానార్మల్ మిస్టరీలో చిక్కుకుపోతోందని పోస్టర్ హింట్ ఇస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
రేర్ కాంబోతో మణిరత్నం లవ్ స్టోరీ.. ఇక ఊహించుకోండి
‘జయం’లో ఛాన్స్.. పార్టీ చేసుకున్న బన్నీ.. తీరా చూస్తే!
నాని కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్.. ఇలా అయిందేంటి