సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Motorcycle Diaries: సితార నుంచి రిషబ్ శెట్టి వినూత్న ప్రయాణం!

ABN, Publish Date - Nov 29 , 2026 | 02:04 PM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ‘మోటార్‌సైకిల్ డైరీస్’ చిత్రాన్ని ప్రకటించాయి. శివా చిరంతన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిషబ్ శెట్టి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రిషబ్ శెట్టి (Rishab Shetty) ఫిల్మ్స్‌తో కలిసి ‘మోటార్‌సైకిల్ డైరీస్’ (Motorcycle Diaries) అనే కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివా చిరంతన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

''గమ్యస్థానాల కంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రతి మలుపు ఓ కథగా, ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా నిలిచేలా ఈ అందమైన ప్రయాణాన్ని తెరకెక్కించనున్నారు. జీవితాన్ని మార్చే అనుభవాలు, మరిచిపోలేని సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు'' చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై టైటిల్ ప్రకటనతోనే ఆసక్తి నెలకొంది.

ALSO READ:
Nithya Menen: యంత్రంలా ఆగకుండా పనిచేయలేను.. కృత్రిమంగా నటించలేను

Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..

‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!

Updated Date - Nov 29 , 2026 | 02:06 PM