సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇరుముడి: ఆ పాట రీమిక్స్‌ చేస్తే.. అయ్యప్ప భక్తులకు పూనకాలే..

ABN, Publish Date - Mar 22 , 2026 | 07:51 PM

సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అలరించారు మాస్‌ మహరాజా రవితేజ. తదుపరి చిత్రంగా ఆయన ‘ఇరుముడి’ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అలరించారు మాస్‌మహరాజా రవితేజ. తదుపరి చిత్రంగా ఆయన ‘ఇరుముడి’ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఓ పాటను రీమిక్స్‌ చేయనున్నారట.

అయ్యప్ప భజనల్లో మారుమోగే ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు’ పాటను రీమిక్స్‌ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ దీనిపై స్పందించారు. ఆ పాటను రీమిక్స్‌ చేయమని ప్రేక్షకులు, అభిమానులు కోరుతున్నారు. అయితే తుది నిర్ణయం దర్శకనిర్మాతలు తీసుకోవలసింది ఉంది’ అని అన్నారు. దీనిపై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 08:26 PM