సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raviteja: రవితేజ 'తులాభారం' మొదలైంది

ABN, Publish Date - Oct 11 , 2026 | 11:18 AM

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా 78వ సినిమా ఆదివారం హైద్రాబాద్ లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Thulabharam

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా 78వ సినిమా ఆదివారం హైద్రాబాద్ లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి మొదటి నుంచి అనుకున్నట్లుగానే 'తులాభారం' (Thulabharam) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, అనస్వర రాజన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్  కీలక పాత్రలో కనిపించనున్నారు. 

పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు వివి. వినాయక్ స్క్రిప్ట్ వివేక్ ఆత్రేయకు అందించారు. హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. అనంతరం సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమా కథకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీని రామురావు విడుదల చేశారు. లక్ష్మణ్‌, శ్రీనిరావు సంయుక్తంగా బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా రవితేజను మాస్ మహారాజ్ గా అభిమానులు పిలుచుకునేవారు. అయితే ఈ సినిమా
టైటిల్స్ లో 'క్రైమ్ మహా రాజా' అని వేశారు. దీనిని బట్టి ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. 

ALSO READ:

Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్‌..

రణబాలి ఓవర్సీస్‌.. ఇతర భాషల్లో వెనక్కి వెళ్లినట్టేనా

Aditi Rao Hydari: గ్లామర్‌ ప్రపంచంలోనూ నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా..

Updated Date - Oct 11 , 2026 | 01:14 PM