సంక్రాంతికి.. రవితేజ 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్
ABN, Publish Date - Aug 26 , 2026 | 05:22 AM
‘ఇరుముడి’ (Irumudi) బ్లాక్‌బస్టర్‌తో ఆనందంగా ఉన్న రవితేజ (Raviteja) మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు.
‘ఇరుముడి’ (Irumudi) బ్లాక్‌బస్టర్‌తో ఆనందంగా ఉన్న రవితేజ (Raviteja) మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మరో యువ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న చిత్రం విడుదల కానుంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. హసిత్ ఫ్రేమ్స్‌లో రవితేజ సరికొత్తగా కనిపించనున్నారు. టైటిల్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. కాగా ఇప్పటికే దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్‌టైన్‌మెంట్ హార్డ్‌కోర్ (Daagudu Muthala Dandakoru,) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ నెట్టింట వైరల్ అవుతోంది.